Prabhas Project k Update: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్ట్ కే స్పెషల్ అప్‌డేట్
Prabhas Project k Update: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్ట్ కే స్పెషల్ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించాడు.
Prabhas Project k Update: ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ కే అప్‌డేట్ రివీల్ చేయబోతున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag aswin)ప్రకటించాడు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోణ్ (Deepika padukone) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే దీపికా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
ట్రెండింగ్ వార్తలు
ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్‌కే కు సంబంధించి పోస్టర్, ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అప్‌డేట్ గురించి ఓ అభిమానిని నాగ్ అశ్విన్ ట్విట్టర్‌లో ప్రశ్న అడిగాడు. అతడి ట్వీట్‌కు నాగ్ అశ్విన్ బదులిచ్చాడు. ప్రభాస్ బర్త్‌డే రోజున ఓ చిన్న సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ప్రాజెక్ట్ కే సినిమాను నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 2023 అక్టోబర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అశ్వనీదత్ గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం.
ప్రాజెక్ట్ కేతో పాటు పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రామాయాణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.