Ponniyin Selvan 2 OTT Release Date: పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఫ్రీ స్ట్రీమింగ్ మాత్రం లేదు
Ponniyin Selvan OTT Release Date: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ -2 మూవీ ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏదంటే...
Ponniyin Selvan 2 OTT Release Date: మణిరత్నం విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ -2 ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. మే 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా విధానంలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
జూన్ సెకండ్ వీక్ నుంచి అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రైట్స్‌ను దాదాపు 120 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోన్నట్లు తెలిసింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారానే రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.
ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయినా నిర్మాతలకు ఈ సీక్వెల్ లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. 335 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ అంచనాల్ని అందుకోలేక నిరాశపరిచింది.
విక్రమ్, జయంరవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. చోళ రాజ్యంలో కుట్రలు పన్నిన శత్రువుల్ని యువరాజులు కరికాళుడు, పొన్నియన్ సెల్వన్ ఎలా ఎదురించారు? కరికాళుడిపై నందిని ప్రతీకారం నెరవేరిందా?
చోళయువరాజులకు అండగా వంధిదేవుడు ఏ విధంగా నిలబడ్డాడన్నది ఎమోషన్స్, యాక్షన్ ప్రధానంగా ఈ సీక్వెల్‌లో మణిరత్నం చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ లెక్కకుమించిన క్యారెక్టర్స్ ఉండటం, తమిళ నేటివిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా ఇతర భాషల పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.