Pawan | బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన పవర్‌స్టార్.. భీమ్లానాయక్ హిందీ ట్రైలర్ చూశారా-pawan kalyan new movie bheemla nayak hindi trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan | బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన పవర్‌స్టార్.. భీమ్లానాయక్ హిందీ ట్రైలర్ చూశారా

Pawan | బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన పవర్‌స్టార్.. భీమ్లానాయక్ హిందీ ట్రైలర్ చూశారా

HT Telugu Desk HT Telugu
Mar 04, 2022 01:23 PM IST

భీమ్లా నాయక్‌ను హిందీలో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను విడుదల చేసింది. డబ్బింగ్ వెర్షన్‌లో భీమ్లా నాయక్ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్
భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ (twitter)

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. అదిరిపోయే కలక్షన్లతో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పవన్, రానాల పర్ఫామెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సేమ్ టూ సేమ్ తెలుగు ట్రైలర్ మాదిరిగానే అవే సన్నివేశాలను హిందీ వెర్షన్‌లోనూ ఉంచింది. కాకపోతే డబ్బింగ్ మాత్రం హిందీ ఆర్టిస్టులు చెప్పారు. అయితే తెలుగు ట్రైలర్ అంత కాకపోయినప్పటికీ హిందీలోనూ ఈ ప్రచార చిత్రం ఆకట్టుకునేలానే ఉంది. ఏదో డబ్బింగ్ చెప్పామంటే చెప్పామని కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టి బాలీవుడ్ ప్రేక్షకులకు నప్పే విధంగా డబ్ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న భీమ్లా నాయక్.. త్వరలో హిందీలోనూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తుందేమో చూడాలి.

ఇటీవల సంచలనాల దర్శకుడు ఆర్జీవీ సైతం భీమ్లా నాయక్‌ను హిందీలో డబ్ చేయాలని పలు సెటైరికల్ ట్వీట్లు పోస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ పుష్ప చిత్రంతో పోలుస్తూ.. భీమ్లా నాయక్ గురించి పోస్టులు పెట్టారు పవన్ స్టామినా హిందీ ప్రేక్షకులకు కూడా తెలియాలంటూ ట్వీట్ చేశారు.

భీమ్లా నాయక్ సినిమా పవన్ కల్యాణ్‌, రానాలు పోటీ పడి నటించారు. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిత్యా మీనన్ నటించగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్‌కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

IPL_Entry_Point

టాపిక్