Pawan Kalyan Kushi Re Release: వారం గ్యాప్‌లో థియేటర్లలోకి వస్తోన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు
Pawan Kalyan Kushi Re Release: పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్‌బాబు ఒక్కడు సినిమాలు వారం వ్యవధిలోనే థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్స్ ఇవే...
Pawan Kalyan Kushi Re Release: త్వరలోనే పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే కొత్త సినిమాలతో కాదు. వారి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్‌బాబు ఒక్కడు సినిమాలు వారం వ్యవధిలో రీ రిలీజ్ కానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈగో సమస్యల చుట్టూ అల్లిన ఈ ప్రేమకథలో పవన్ యాక్టింగ్, అతడి డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ యువతరం ప్రేక్షకుల్ని మెప్పించాయి. 2001లో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను రెట్టింపు చేసింది.
ఖుషి సినిమా డిసెంబర్ 31న రీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే రీ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియనల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఖుషి రిలీజైన వారం తర్వాత మహేష్‌బాబు ఒక్కడు సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను జనవరి 7న రీ రిలీజ్ చేయబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఖుషి, ఒక్కడు సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించడం గమనార్హం. ఇద్దరు అగ్ర హీరోల సినిమాల వారం వ్యవధిలో రీ రిలీజ్ కావడం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.