Pavitra Lokesh - Naresh: న‌రేష్‌తో ప్రేమ పాఠాలు - క‌ర్ణాట‌కలో ఆ పాఠాలు - ప‌విత్రాలోకేష్‌లోని మ‌రో యాంగిల్‌-pavitra lokesh attends phd entrance exam in hampi kannada university with naresh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pavitra Lokesh Attends Phd Entrance Exam In Hampi Kannada University With Naresh

Pavitra Lokesh - Naresh: న‌రేష్‌తో ప్రేమ పాఠాలు - క‌ర్ణాట‌కలో ఆ పాఠాలు - ప‌విత్రాలోకేష్‌లోని మ‌రో యాంగిల్‌

HT Telugu Desk HT Telugu
May 31, 2023 04:09 PM IST

Pavitra Lokesh - Naresh: గ‌త కొంత‌కాలంగా సినిమాల కంటే న‌రేష్‌తో అనుబంధం కార‌ణంగా ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది ప‌విత్రా లోకేష్‌. కాగా క‌న్న‌డ సాహిత్యంలో ప‌విత్రా లోకేష్ పీహెచ్‌డీ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

న‌రేష్, ప‌విత్రా లోకేష్‌
న‌రేష్, ప‌విత్రా లోకేష్‌

Pavitra Lokesh - Naresh: మ‌ళ్లీ పెళ్లి సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు న‌రేష్, ప‌విత్రా లోకేష్‌. త‌మ జీవితంలో కొంత‌కాలంగా జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌ల‌కు తెర‌రూప‌మిస్తూ రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు. సినిమా ద్వారా త‌మ మ‌ధ్య ఉన్న స్వ‌చ్ఛ‌మైన ప్రేమ బంధాన్ని చాటిచెప్పాల‌ని అనుకున్నారు.కానీ వీరి ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డమే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

కాగా ఓ వైపు సినిమాల‌పై దృష్టిసారిస్తూనే క‌న్న‌డ సాహిత్యంలో పీహెచ్‌డీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ప‌విత్రా లోకేష్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లోని హోస్పెట్‌లో ఉన్న హంపి క‌న్న‌డ యూరివ‌ర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు ప‌విత్రా లోకేష్ అటెండ్ అయిన‌ట్లు తెలిసింది.

ఈ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ఎగ్జామ్స్ రాసేందుకు న‌రేష్‌తో క‌లిసి ప‌విత్రా లోకేష్ హోస్పెట్ వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఎంట్రెన్స్ టెస్ట్ పూర్త‌యిన త‌ర్వాత యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీకి ఆమె అప్లై కూడా చేసిన‌ట్లు చెబుతోన్నారు.

తెలుగులో ప‌విత్రా లోకేష్ ఇప్ప‌టివ‌ర‌కు వంద‌కుపైగా సినిమాల్లో న‌టించింది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, రేసుగుర్రంతో పాటు ప‌లు సినిమాల్లో మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్స్ ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. న‌రేష్, ప‌విత్రా లోకేష్ క‌లిసి స‌మ్మోహ‌నం, ఎంత‌మంచివాడ‌వురాతో పాటు సినిమాల్లో జోడీగా న‌టించారు. గ‌త కొన్నేళ్లుగా వీరిద్ద‌రు లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point

టాపిక్