Parineeti Chopra Engagement: పంజాబీ స్టైల్‌లో ప‌రిణీతి, రాఘ‌వ్ ఎంగేజ్‌మెంట్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక‌ చోప్రా-parineeti chopra raghav chadha to get engaged today at delhi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Parineeti Chopra Engagement: పంజాబీ స్టైల్‌లో ప‌రిణీతి, రాఘ‌వ్ ఎంగేజ్‌మెంట్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక‌ చోప్రా

Parineeti Chopra Engagement: పంజాబీ స్టైల్‌లో ప‌రిణీతి, రాఘ‌వ్ ఎంగేజ్‌మెంట్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక‌ చోప్రా

HT Telugu Desk HT Telugu
May 13, 2023 12:31 PM IST

Parineeti Chopra Engagement: బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ఎంగేజ్‌మెంట్ నేడు ఢిల్లీలో జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కు ప్రియాంక చోప్రాతో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌రుకాబోతున్నారు.

 ప‌రిణీతి చోప్రా,  రాఘ‌వ్ చ‌ద్దా
ప‌రిణీతి చోప్రా, రాఘ‌వ్ చ‌ద్దా

Parineeti Chopra Engagement: బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీట‌ల మీద‌కు తీసుకెళ్లేందుకు ఓ అడుగు ముందుకు వేయ‌బోతున్నారు. శ‌నివారం (నేడు) ప‌రిణీతి, రాఘ‌వ్ నిశ్చితార్థం జ‌రుగ‌నుంది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక‌కు న్యూఢిల్లీలోని ఇండియా గేట్ స‌మీపంలో ఉన్న‌ క‌పుర్త‌లా హౌజ్ ను వేదిక‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

సాయంత్రం ఐదు గంట‌లకు ఎంగేజ్‌మెంట్ సెల‌బ్రేష‌న్స్ ప్రారంభంకానున్న‌ట్లు తెలిసింది. పంజాబీ సంప్ర‌దాయం ప్ర‌కారం ఈ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర‌లో ప‌రిణీతి, రాఘ‌వ్ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్రియాంక వ‌చ్చేసింది

ప‌రిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ కోసం ప్రియాంక చోప్రాఅమెరికా నుంచి ఇండియా వ‌చ్చింది. శ‌నివారం న్యూఢిల్లీ విమానాశ్ర‌యంలో ప్రియాంక క‌నిపించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ప్రియాంక‌, ప‌రిణీతి క‌జిన్స్ అవుతారు. సోద‌రి నిశ్చితార్థం కోస‌మే స్పెష‌ల్‌గా ప్రియాంక చోప్రా ఇండియాకు వ‌చ్చింది.

భ‌ర్త‌, కూతురితో కాకుండా సోలోగా ఈ వేడుక‌లో ప్రియాంక పాల్గొన‌నున్న‌ది. నిక్ కొత్త మ్యూజిక్ ఆల్బ‌మ్ ప‌నుల‌తో బిజీగా ఉండ‌టంతోనే అత‌డు ఈ వేడుక‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని తెలిసింది. ప‌రిణీతి ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో ప్రియాంక స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ప్రియాంక చోప్రాతో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొనున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 1000 మందికి ఆహ్వానాలు అందిన‌ట్లు తెలుస్తోంది.

కొద్ది ప‌రిచ‌యంలోనే

ప‌రిణీతి, రాఘ‌వ్ చ‌ద్దాల మ‌ధ్య ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేమ చిగురించిన‌ట్లు చెబుతోన్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో క‌లిసి డిన్న‌ర్ చేస్తూ మీడియా కంట ప‌డ‌టంతో వీరిద్ద‌రి డేటింగ్ వార్త‌లు బ‌య‌ట‌కొచ్చాయి. ఐపీఎల్ మ్యాచ్‌లోనూ క‌లిసి సంద‌డిచేశారు. విహార‌యాత్ర‌కు జంట‌గా వెళ్లారు. ఈ ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

IPL_Entry_Point

టాపిక్