NTR: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎన్టీఆర్ - కార‌ణం ఇదే-ntr apologizes to fans for brahmastra pre release event cancelled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎన్టీఆర్ - కార‌ణం ఇదే

NTR: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎన్టీఆర్ - కార‌ణం ఇదే

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 06:31 AM IST

NTR: శుక్రవారం హైదరాబాద్ లో జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఫ్యాన్స్ అందరికి ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పాడు.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ (Twitter)

NTR: ర‌ణ్‌భీర్ క‌పూర్‌, అలియాభట్ జంటగా బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో బ్రహ్మాస్త్ర రిలీజ్ కానుంది. కాగా సోమవారం ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. వినాయకచవితి దృష్ట్యా భద్రతా కారణాల వల్ల పోలీసులు ఈ వేడుకకు అనుమతిని నిరాకరించారు. దాంతో ఓ హోటల్ లో సింపుల్ గా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ ద్వారా అభిమానులకు ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆర్భాటంగా చేయాలని అనుకున్నాం. వినాయక చవితి కారణంగా ప్రొటెక్షన్ ఎక్కువగా అందించలేమని పోలీసులు కోరారు. మన భద్రత కోసమే వారు కష్టపడుతున్నారు. వారి మాట వినడం దేశ పౌరుడిగా ప్రథమధర్మంగా భావించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశాం. ఈ ఈవెంట్ కు రావాలని అనుకున్నా, వచ్చిన అభిమానులందరికి తలవించి క్షమాపణలు కోరుతున్నా. ఈవెంట్ కు రాకపోయినా మంచి చిత్రాల్ని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అమితాబ్ యాక్టింగ్ లోని ఇంటెన్సిటీ అంటే నాకు ఇష్టం.

అతడు నడిచే విధానం, మాట్లాడే తీరు, కళ్లు ప్రతి ఒక్కటి విభిన్నంగా ఉంటాయి. అమితాబ్ తర్వాత అంతగా నేను అభిమానించే నటుడు రణ్ భీర్ కపూర్. అతడు నటించిన సినిమాల్లో రాక్ స్టార్ నాకు చాలా ఇష్టం. అలియా భట్ నాకు అత్యంత ఆప్తురాలు. ఈ వేదికపై ఉన్న వారిలో నా ఎమోషన్స్ ను ఎక్కువగా పంచుకునేది రాజమౌళి, నాగార్జున బాబాయ్ తర్వాత అలియానే. నేటితరంలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచే నాయికల్లో ఆమె ఒకరు.

గ్లోబల్ లెవల్ లో సినిమా ఇండస్ట్రీపై ఒత్తిడి పెరగింది. ఇప్పుడొస్తున్న కంటెంట్ కాకుండా ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఒత్తిడి లోనే నటులు బాగా పనిచేస్తారని నేను నమ్ముతాను. అన్ని ఇండస్ట్రీలు ఈ సవాల్ ను స్వీకరిస్తూ మంచి సినిమాలు చేయాలి. ’ అని తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల నుండి పుట్టిన కథ ఇదని, భాషా భేదాలతో కూడిన సినిమాలు కాకుండా భారతీయ సినిమా చేయాలన్నదే తన అభిమతమని ఈ వేడుకలో రాజమౌళి పేర్కొన్నారు.

IPL_Entry_Point