Tollywood Young Heroes Pan Indian Movies: పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత సినిమాల పరంగా ఉన్న భాషాపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది భాషల్లో మంచి వసూళ్లను రాబడుతోన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మొదలుకొని యంగ్ హీరోల వరకు తాము నటిస్తోన్న సినిమాల్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తోన్నారు.,పాన్ ఇండియా లెవల్‌లో విజయాల్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం కొందరు టాలీవుడ్ హీరోలు ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. ఈ పాన్ ఇండియన్ పరీక్షలో వారు పాస్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.,దసరాతో నాని…దసరా సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్‌లో తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు నాని. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. తెలుగులో రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు మిగిలిన భాషల్లో మార్చి 30న రిలీజ్ కానుంది.,అంటే సుందరానికి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిలైన నాని దసరాతో హిట్ కొడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. విరూపాక్ష సినిమాతో తొలిసారి సాయిధరమ్‌తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.,ధమ్కీతో ఫస్ట్ టైమ్…ధమ్కీ సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్. ఈ సినిమాకే అతడే దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో డ్యూయల్ రోల్‌లో విశ్వక్‌సేన్ నటించబోతున్నాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఉగాదికి మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరో యంగ్ హీరో తేజా సజ్జా కూడా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. సూపర్ హీరో కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్నాడు.,ఏజెంట్ కూడా...అఖిల్ ఏజెంట్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. వీరితో పాటు మరికొందరు యంగ్ హీరోలు పాన్ ఇండియన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.