Dasara Movie : దసరా షూటింగ్ కంప్లీట్.. కొత్త లుక్​లో నాని-nani and keerthy suresh dasara movie shooting complete ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani And Keerthy Suresh Dasara Movie Shooting Complete

Dasara Movie : దసరా షూటింగ్ కంప్లీట్.. కొత్త లుక్​లో నాని

HT Telugu Desk HT Telugu
Jan 14, 2023 07:12 AM IST

Nani's Dasara Cinema : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని హీరోహీరోయిన్లు నాని, కిర్తీ సురేశ్ చెప్పారు.

కీర్తి సురేశ్, నాని
కీర్తి సురేశ్, నాని (twitter)

నేచురల్ స్టార్ నాని(Nani), కిర్తీ సురేష్(Keerthy Suresh) జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనలు బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోంది. దీనికి సంబంధించి.. షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా.. నాని, కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. నాని కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.

దసరా సినిమా(Dasara)పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణ యాసలో విడుదలై ఓ పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాని రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. శ్రీకాంత ఒద్దెల సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేశ్(Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్(Prakash Raj), సాయి కుమార్, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, మీరా జాస్మిన్, పూర్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు.. రూ.70 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది.

సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తి అయిందని, హీరోహీరోయిన్లు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన నాని.. ఇప్పుడు లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం ఈ లుక్ మార్చినట్టుగా ఉన్నాడు.

నాని 30వ సినిమాకు సంబంధించి.. వీడియో గ్లింప్స్ ద్వారా ఇటీవల ప్రకటించాడు. అందులో తరువాతి సినిమా(Cinema)కు గడ్డం ఉండదు అని చెప్పుకొచ్చాడు. తర్వాత రాబోయే సినిమాలో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నాడని టాక్. గతంలో జెర్సీ(jersey) సినిమాతో అలా ఆకట్టుకున్నాడు. నాని సినిమాలో మృణాల్ ఠాకుర్(mrunal thakur) నటిస్తోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ పరిచయం అవుతున్నాడు. ఇక మలయళ బ్లాక్ బస్టర్ హృదయం సినిమాకు సంగీతం ఇచ్చిన హేశం అబ్దుల్ వహాబ్ నాని కొత్త సినిమాకు పని చేయనున్నాడు.

IPL_Entry_Point

టాపిక్