Namrata Shirodkar on Quit Films: ఆ విషయంలో సౌత్ స్టార్స్ బెటర్ - నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
Namrata Shirodkar on Quit Films: మహేశ్‌బాబుతో పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాల్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నమ్రత. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Namrata Shirodkar on Quit Films: టాలీవుడ్ బెస్ట్ కపుల్‌లలో ఒకరిగా మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ జంటను అభివర్ణిస్తుంటారు. వంశీ సినిమాలో మహేష్‌బాబుతో కలిసి నటించింది నమ్రత. ఆ సినిమాలోనే నమ్రతతో మహేష్ ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మహేష్, నమ్రత పెళ్లి చేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ సినిమాలకు దూరమైంది. కుటుంబ బాధ్యతలకు పరిమితమైంది. అందుకు గల కారణాల్ని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించింది నమ్రతా శిరోద్కర్. పెళ్లి తర్వాత తాను సినిమాలు చేయవద్దని మహేష్ ముందుగానే కండీషన్ పెట్టాడని నమ్రత చెప్పింది.
ఇంటి పట్టున ఉండే భార్య కావాలనే విషయాన్ని తనకు క్లియర్‌గా చెప్పాడని అన్నది. మహేష్ కండీషన్‌ను తాను అంగీకరించానని అందుకే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనట్లు చెప్పింది. ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తిచేసిన తర్వాతే తాము పెళ్లి చేసుకున్నామని చెప్పింది.
ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ వల్ల ఈ విషయంలో తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవ్వలేదని చెప్పింది. పెళ్లి తర్వాత కథానాయికలు సినిమాలకు దూరమవ్వడం అన్నది సమస్యగా తాను ఎప్పుడూ పరిగణించలేదని తెలిపింది.
రిషికపూర్‌తో పెళ్లి తర్వాత నీతూ కపూర్ సినిమాలు చేయలేదని అన్నది. జెనీలియాతో పాటు చాలా మంది హీరోయిన్లు వివాహానంతరం సినిమాలకు దూరమయ్యారని గుర్తుచేసింది. మహిళలు ఇంటికే పరిమితం కావాలని శాసించకూడదని నమ్రత చెప్పింది.
వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని అన్నది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా అమ్మ పనిచేసేదని, ఆ సమయంలో అమ్మ బయట పనిచేయడం కంటే ఇంటి పట్టునే ఉంటే బాగుండేదని తాను అనుకునేదాన్నని చెప్పింది.
స్త్రీలు ఇంట్లోనే ఉండాలా? పనిచేయాలా అనే నిర్ణయాధికారం వారికే ఉంటే మంచిదని నమ్రత పేర్కొన్నది. స్త్రీకి స్వేచ్ఛనిచ్చే విషయంలో సౌత్ స్టార్ చాలా బెటర్ అని నమ్రత పేర్కొన్నది. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.