Thaggedhe Le Song Out: నవీన్ చంద్ర హీరోగా.. దివ్య పిళ్లై హీరోయిన్‌గా చేసిన చిత్రం తగ్గేదేలే. పుష్ప సినిమాలో యావత్ దేశాన్ని ఉర్రూతలూగిన అల్లు అర్జున్ పలికే మాట తగ్గేదేలే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తగ్గేదేలే అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది.,ఈ ఐటెమ్ నెంబర్‌లో ఆర్జీవీ డేంజరస్ హీరోయిన్ నైనా గంగూలీ స్టెప్పులేసింది. తగ్గేదేలే అంటూ ఆమె డ్యాన్సులు కుర్రకారుకు ఊపుతెప్పిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ స్టెప్పులతో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల నుంచి ఈ పాటపై రెస్పాన్స్ బాగా వస్తుంది.,హుషారైన ఈ సాంగ్‌ను ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించింది. ఈమెతో పాటు చరణ్ అర్జున్, శరత్ రవి పాడారు. ఈ పాటకు చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించి.. అతడే సంగీతాన్ని సమకూర్చాడు. హుషారుగా సాగుతున్న పాటపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోందీ పాట.,ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. అనన్యా సేనుగుప్తా, నైనా గంగూలీ, రవిశంకర్, రాజా రవిందర్, నాగబాబు తదితరులు కీలక భూమికలు పోషిస్తున్నారు. భద్రా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమ్ కుమార్ పాండే, ఎన్ అఖిలేష్ రెడ్డి, పీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. దండుపాళ్యం దర్శకుడు శ్రీనివాస రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.,,