Naga Chaitanya Custody Update: 'కస్టడీ' నుంచి బయటకొచ్చిన నాగచైతన్య.. సమ్మర్‌లో మళ్లీ లాక్-naga chaitanya custody movie wrapped up and coming on may 12 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Custody Update: 'కస్టడీ' నుంచి బయటకొచ్చిన నాగచైతన్య.. సమ్మర్‌లో మళ్లీ లాక్

Naga Chaitanya Custody Update: 'కస్టడీ' నుంచి బయటకొచ్చిన నాగచైతన్య.. సమ్మర్‌లో మళ్లీ లాక్

Naga Chaitanya Custody Update: టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. అంతేకాకుండా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం.

కస్టడీలో నాగచైతన్య

Naga Chaitanya Custody Update: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య గతేడాది థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కస్టడీ అనే టైటిల్ కూడా పెట్టిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రానుంది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీ షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం పంచుకుంది.

దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. “చైతూ మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల అని చెప్పగా.. మీ అందర్నీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం థియేటర్లో కలుద్దాం” అంటూ నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడంతో వీడియో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కస్టడీ సినిమాకు సంబంధించిన పోస్టర్ నుంచి లేటెస్ట్ గ్లింప్స్ వరకు ప్రతి అప్డేట్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆడియెన్స్‌లో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.