Michael OTT Release Date సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నది. ,ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ దక్కించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషించారు. ,గ్యాంగ్‌స్టర్ కావాలనే లక్ష్యంతో ముంబాయిలో అడుగుపెట్టిన ఓ యువకుడి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ అమ్మాయితో ప్రేమ కారణంగా అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది యాక్షన్...ఎమోషనల్ అంశాలతో దర్శకుడు ఈ సినిమాలో చూపించారు. ,సందీప్‌కిషన్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇదే. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఒకేరోజు ఈ సినిమాను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కథ విషయంలోనే ఈ సినిమాపై విమర్శలొస్తున్నాయి. ,కేజీఎఫ్, నాయకుడుతో పాటు గ్యాంగ్‌స్టర్ కథాంశాలతో రూపొందిన పలు సినిమాల స్ఫూర్తితో మైఖేల్‌ను తెరకెక్కించినట్లు ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.