Waltair Veerayya Hindi Teasers: హిందీలో వీరయ్య.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మెగాస్టార్-megastar chiranjeevi waltair veerayya hindi teasers released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Hindi Teasers: హిందీలో వీరయ్య.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మెగాస్టార్

Waltair Veerayya Hindi Teasers: హిందీలో వీరయ్య.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మెగాస్టార్

Maragani Govardhan HT Telugu
Dec 29, 2022 11:23 AM IST

Waltair Veerayya Hindi Teasers: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను హిందీలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా హిందీ టీజర్లను విడుదల చేశారు.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి

Waltair Veerayya Hindi Teasers: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా అలరించనుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా వాల్తేరు వీరయ్య హిందీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

చిరంజీవితో పాటు రవితేజకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్‌కు చేరువైంది.

మన మెగాస్టార్ తెలుగుతోపాటు బాలీవుడ్‌ మార్కెట్‌పై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గాడ్‌ఫాదర్ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో సల్మాన్ అతిథి పాత్రలో మెరవడంతో అక్కడ కూడా కాస్త బజ్ ఏర్పడింది. వసూళ్లు కూడా ఫర్వాలేదనిపించాయి. దీంతో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా రవితేజకు హిందీ డబ్బింగ్ చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులను అలరించాయి. కాబట్టి ఆయన అక్కడ సుపరిచితులే.

మరోపక్క మైత్రీ మూవీ మేకర్స్ కూడా గతేడాది పుష్ప సినిమాతో హిందీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో బాలీవుడ్‌లోనూ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. మరీ ఈ సినిమా ఏ మాత్రం నార్త్ ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం