Maheshbabu: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాతో పోకిరికి ఉన్న లింకేంటి?
టాలీవుడ్ అగ్ర హీరో మహేష్‌బాబు (Maheshbabu) సెంటిమెంట్స్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్(Trivikram) తో చేయబోతున్న సినిమా కోసం ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. అదేమిటంటే....
అతడు, , ఖలేజా తర్వాత మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా(SSMB28) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది చిత్ర యూనిట్. 2023 ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా ఏప్రిల్ 28 మహేష్‌బాబు కెరీర్‌లో మర్చిపోలేని రోజు.
అదే రోజున మహేష్ నటించిన పోకిరి సినిమా రిలీజ్ అయ్యింది. పోకిరి సినిమా మహేష్‌బాబు కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌హిట్‌గా నిలవడమే కాకుండా స్టార్ హీరో ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేయగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. మహేష్ బాబుకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన పోకిరి రిలీజ్ రోజున త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా మహేష్‌బాబు సెంటిమెంట్స్‌కు చాలా ప్రాధాన్యమిస్తారు. మరి పోకిరి సెంటిమెంట్ అతడికి ఏ మేరకు కలిసివస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పోకిరి మ్యాజిక్‌ను త్రివిక్రమ్ ఎంతవరకు రిపీట్ చేస్తుందో చూడాల్సిందే. ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటైన బాహుబలి 2 కూడా ఏప్రిల్ 28నే వచ్చింది.
టాలీవుడ్ వర్గాలకు కలిసివచ్చిన డేట్ కావడంతోనే మహేష్‌బాబు, త్రివిక్రమ్ ఏప్రిల్ 28న తమ హ్యాట్రిక్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నది. ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలు అవాస్తవమంటూ చిత్ర యూనిట్ గురువారం క్లారిటీ ఇచ్చింది.