Krishna Mukunda Murari May 18th Episode: మురారిని పెళ్లి చేసుకోవ‌డానికి కొత్త ప్లాన్ వేసిన ముకుంద-krishna mukunda murari may 18th episode mukunda reveals her love on murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari May 18th Episode Mukunda Reveals Her Love On Murari

Krishna Mukunda Murari May 18th Episode: మురారిని పెళ్లి చేసుకోవ‌డానికి కొత్త ప్లాన్ వేసిన ముకుంద

HT Telugu Desk HT Telugu
May 18, 2023 09:08 AM IST

Krishna Mukunda Murari May 18th Episode: త‌న మ‌న‌సులో మురారికి త‌ప్ప మ‌రోక‌రికి చోటులేద‌ని అంటుంది ముకుంద‌. అత‌డితోనే త‌న పెళ్లి జ‌ర‌గితీరాలని చెబుతుంది. ఆ బాధ్య‌త‌ను తండ్రికి అప్ప‌గిస్తుంది.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 18th Episode: ముకుంద‌కు మ‌రో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆమె తండ్రి శ్రీనివాస్‌ను భ‌వానీ క‌న్వీన్స్ చేసి పంపిస్తుంది. ఆ స‌మ‌యంలో మురారి ఏం మాట్లాడ‌క‌పోవ‌డంపై ముకుంద తండ్రి అత‌డిని త‌ప్పుప‌డ‌తాడు. శ్రీనివాస్ అన్న మాట‌ల గురించి మురారి సీరియ‌స్‌గా ఆలోచిస్తుండ‌గా కృష్ణ అత‌డిని ఆట‌ప‌ట్టిస్తుంది. ఆమెపై కోపాన్ని వ్య‌క్తం చేస్తాడు మురారి. అత‌డి మాట‌ల‌కు ముకుంద వాళ్ల నాన్న వ‌చ్చి గొడ‌వ చేస్తే మ‌నం ఎందుకు మ‌న‌శ్శాంతి పోగోట్టుకోవాల‌ని అంటుంది కృష్ణ‌.

మురారి షాక్‌...

శ్రీనివాస్ చేయాల‌నుకున్న‌ది క‌రెక్టేనా అని కృష్ణ‌ను అడుగుతాడు మురారి. వంద‌శాతం క‌రెక్ట్ అని చెబుతుంది కృష్ణ‌. ముకుంద‌కు ఇంకో పెళ్లి చేయ‌డ‌మే మంచిద‌ని అంటుంది. ఆమె మాట‌ల‌కు మురారి షాక్ అవుతాడు. ఒక‌వేళ ఆద‌ర్శ్ తిరిగిరాక‌పోతే ముకుంద ప‌రిస్థితి ఏమిట‌ని అంటుంది కృష్ణ‌. ఆమె క‌న్న తండ్రి మాట్లాడిన దాంట్లో త‌ప్పు లేద‌ని చెబుతంది.

కానీ ఆద‌ర్శ్ త‌ప్ప‌కుండా తిరిగివ‌స్తాడ‌ని, ముకుంద జీవితం చ‌క్క‌బ‌డుతుంద‌ని మురారి విశ్వాసం వ్య‌క్తం చేస్తాడు. అత‌డి మాట‌ల‌కు ఉమ్మ‌డి కుటుంబం, ఆస్తి అంత‌స్తుల వ‌ల్లే ముకుంద ఈ మాత్ర‌మైనా ఆనందంగా ఉండ‌గ‌లుగుతుంద‌ని ముకుంద‌పై జాలి ప‌డుతుంది కృష్ణ‌.

కృష్ణ మాట‌ల‌తో మురారి ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. నువ్వు వెళ్లిపోతే త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌నే ఆశ‌లో ముకుంద ఉంద‌ని మ‌న‌సులోనే అనుకుంటాడు. ఆ త‌ర్వాత ఆద‌ర్శ్ తిరిగి వ‌స్తాడా లేదా అనే విష‌యంలో కృష్ణ ఓ టెస్ట్ పెడుతుంది. అందులో ఆద‌ర్శ్ తిరిగి రాడ‌ని వ‌స్తుంది.

తండ్రిని త‌ప్పుప‌ట్టిన ముకుంద‌...

తండ్రి త‌న‌కు మ‌రో పెళ్లి చేయాల‌ని అనుకున్న మాట‌ల‌ను త‌ప్పుప‌డుతుంది ముకుంద‌. మురారిని తాను ప్రేమిస్తున్నాన‌ని తెలిసినా కూడా త‌న‌కు ఆద‌ర్శ్‌తో బ‌ల‌వంతంగా పెళ్లి చేశార‌ని అంటుంది. మీరు చేసిన ఆప‌రాధం వ‌ల్ల తాను న‌ర‌కాన్ని అనుభ‌విస్తున్న‌ట్లు చెబుతుంది. ప్రేమించిన వాడిని ఎదురు గా పెట్టుకొని ఏం కానీ దానిలా మిగిలిపోయాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇప్పుడు త‌న‌కు విడాకులు ఇప్పించి మ‌రో వ్య‌క్తితో పెళ్లి చేస్తే నా జీవితంలో ముగ్గురు మ‌గాళ్లు ఉంటారు. ఇంత‌కంటే ద‌రిద్రం ఇంకొక‌టి ఉండ‌ద‌ని తండ్రితో అంటుంది. ప్రేమించిన వాడినైనా పెళ్లిచేసుకోవాలి. లేదంటే పెళ్లిచేసుకున్నావాడితోనైనా స‌ర్ధుకొని బ‌త‌కాలి అని అంటుంది ముకుంద‌.

ఆమె మాట‌ల‌కు నీ మ‌న‌సులో ఏముందో అదైనా చెప్పు అంటే మురారి త‌ప్పు ఏం లేద‌ని అంటుంది. అది త‌ప్పు అని , అలాంటి ఆలోచ‌నే మ‌న‌సులోకి రాకూడ‌ద‌ని తండ్రి చెప్పినా ప‌ట్టించుకోదు ముకుంద‌.

ముకుంద మ‌న‌సులో మురారి....

త‌న మ‌న‌సులో మొద‌టి నుంచి మురారే ఉన్నాడు. తాను మ‌ర‌ణించే వ‌ర‌కు అత‌డే ఉంటాడు. మ‌ధ్య‌లో అతిథిగా భ‌ర్త వ‌చ్చివెళ్లిపోయాడ‌ని, అత‌డి గుర్తుగా తాళి మాత్ర‌మే ఉంద‌ని తండ్రితో చెబుతుంది ముకుంద‌. మురారిని పెళ్లి చేసుకుంటే త‌ప్పంటేని అంటుంది. త‌న‌ మ‌న‌సులో జీవితంలో మ‌రో అమ్మాయికి చోటు ఉండ‌ద‌ని మురారి మాటిచ్చిన విష‌యాన్ని తండ్రికి గుర్తుచేస్తుంది.

కృష్ణ‌తో అత‌డికి జ‌రిగిన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి వివ‌రిస్తుంది. డాక్ట‌ర్ అయ్యే వ‌ర‌కే కృష్ణ అత‌డితో ఉంటుంద‌ని చెబుతుంది. ఆమె మాట‌ల‌కు మురారి నిన్ను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాడా అని శ్రీనివాస్ ముకుంద‌ను అడుగుతాడు. లేడని…ఆద‌ర్శ్ తిరిగి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కంతో అత‌డు ఉన్నాడ‌ని ముకుంద స‌మాధాన‌మిస్తుంది.

కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే వెంట‌నే త‌మ పెళ్లి జ‌రిగిపోవాల‌ని అంటుంది. మురారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించే బాధ్య‌త‌ను తండ్రిపై పెట్టి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది ముకుంద‌. కూతురు మాట‌ల‌కు శ్రీనివాస్ షాక్ అవుతాడు.

కృష్ణ‌కు మురారి ప్ర‌పోజ్‌...

ఆ త‌ర్వాత ఆశ్ర‌మానికి వెళ్లిన భ‌వానీ...రేవ‌తికి ఫోన్ చేసి ముకుంద మ‌న‌సులో ఏముందో క‌నుక్కోమ‌ని అంటోంది. ఆమె మాట‌ల‌కు ముకుంద మ‌న‌సులో ఏం ఉంటుంది మురారి త‌ప్ప అని లోలోన అనుకుంటుంది రేవ‌తి. కానీ బ‌య‌ట‌కు మాత్రం ఆ మాట చెప్ప‌దు. మురారి వ‌ర్క్‌లో సీరియ‌స్‌గా మునిగిపోతాడు. దాంతో అత‌డికి తానే ద‌గ్గ‌రుండి కృష్ణ టిఫిన్ తినిపిస్తుంది

కృష్ణ ప్రేమ‌ను చూసి మురారి ఆనంద‌ప‌డ‌తాడు. ఒక‌రి క‌ళ్ల‌ల్లోకి మ‌రొక‌రు చూస్తూ లోకాన్ని మ‌ర‌చిపోతారు. ఆ ఆనంద క్ష‌ణాల్ని మురారి బ్ర‌ద‌ర్ ఫోన్‌లో రికార్డ్ చేస్తాడు. కృష్ణ‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌మ‌ని రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇస్తాడు. ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన ముకుంద...మురారి ఏం చెబుతాడో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తుంది. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point