Krishna Mukunda Murari May 16th Episode: మురారికి ముకుంద అడ్డు తొల‌గిపోనుందా? - కృష్ణ ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్‌లో ఏముంది?-krishna mukunda murari may 16 episode murari unhappy with krishnas birthday gift ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari May 16th Episode: మురారికి ముకుంద అడ్డు తొల‌గిపోనుందా? - కృష్ణ ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్‌లో ఏముంది?

Krishna Mukunda Murari May 16th Episode: మురారికి ముకుంద అడ్డు తొల‌గిపోనుందా? - కృష్ణ ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్‌లో ఏముంది?

HT Telugu Desk HT Telugu
May 16, 2023 09:45 AM IST

Krishna Mukunda Murari May 16th Episode: ముకుంద‌ను దూరంగా ఉంచాలంటే కృష్ణ‌కు ద‌గ్గ‌ర కావాల‌ని మురారి డిసైడ్ అవుతాడు. కృష్ణ‌పై ప్రేమ‌ను కురిపించ‌డం మొద‌లుపెడ‌తాడు.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari May 16th Episode: ముకుంద త‌న‌కు దొంగ‌చాటుగా తొడిగిన ఉంగ‌రాన్ని తీసేయ‌డానికి మురారి చాలా ప్ర‌య‌త్నిస్తుంటాడు. అది చూసి ఆ ఉంగ‌రాన్ని తీసి మ‌న ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేస్తావా అంటూ అత‌డిపై ముకుంద కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. నాకు పెళ్లైంది...నీకు పెళ్లింది...మ‌నిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ ఏంటి అంటూ ముకుంద‌పై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు మురారి. ఇది అన్యాయం అని అంటాడు.

ఎవ‌రికి అన్యాయం...

అందుకు ఎవ‌రికి అన్యాయం చేస్తున్నాం... నాలుగు రోజుల్లో వెళ్లిపోయే కృష్ణ‌కా...బ‌తికున్నాడో లేదో తెలియ‌ని ఆద‌ర్శ్ కా.....నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు... మ‌న ప్రేమ‌కు అన్యాయం చేస్తున్నావు...నీ నుంచి న్యాయం కోరుతూ ఈ ఉంగ‌రాన్ని తొడిగాను. దైవ‌సాక్షిగా మ‌న‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లే అని మురారితో అంటుంది కృష్ణ‌.

నువ్వు ఆద‌ర్శ్‌ను తీసుకొచ్చినా...నీతో ఆగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్న కృష్ణ‌ను ఆపిన నువ్వు చెప్పిన‌ట్లే వింటాన‌ని బ‌లంగా చెబుతుంది ముకుంద‌. ఈ ఉంగ‌రం ఎప్ప‌టికీ నీ వేలికి అలాగే ఉండాలి..ఇందులో త‌ప్పు లేదు. నాతో ఆద‌ర్శ్ ఉండుంటే నా ప్రేమ‌ను మ‌న‌సులోనే స‌మాధి చెసుకునేదాన్ని. నీ కాపురం కృష్ణ‌తో బాగున్నా నీవైపు క‌న్నెత్తి చూసేదాన్ని కాద‌ని అంటుంది. ఉంగ‌రం తొడిగిన క్ష‌ణం నుంచి మాన‌సికంగా నేను నీ దాన్ని అయిపోయా అని మురారితో చెబుతంది.

మురారి అబ‌ద్ధం...

రెస్టారెంట్‌లో లంచ్ చేస్తోన్న స‌మ‌యంలో మురారి చేతికి ముకుంద తొడిగిన ఉంగ‌రం అంద‌రి కంట ప‌డుతుంది. ఆ రింగ్ ఎక్క‌డిద‌ని రేవ‌తి అత‌డిని అడుగుతుంది. దాంతో ఏమ‌ని స‌మాధానం చెప్పాలో అర్థం కాక త‌డ‌బ‌డుతుంటాడు మురారి. గుడికి వ‌చ్చే ముందు లేదు క‌దా..ఇంత‌లోనే ఎలా వ‌చ్చింద‌ని కృష్ణ కూడా అత‌డిని అడుగుతుంది. గుడిలో క‌లిసిన క‌మీష‌న‌ర్ ఆ రింగ్ బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని అబ‌ద్దం ఆడుతాడు మురారి. రేవ‌తికి అత‌డిపై అనుమానం మొద‌ల‌వుతుంది.

కృష్ణ గిఫ్ట్ ను ఓపెన్ చేసిన మురారి…

త‌న బ‌ర్త్‌డేకు కృష్ణ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేస్తాడు మురారి. అత‌డి కోసం సొంతంగా కృష్ణ‌ త‌యారు చేసిన ఆర్గానిక్ ప‌ర్స్‌ను ఉంటుంది. కొంత డ‌బ్బుతో పాటు ఓ లెట‌ర్ కూడా అందులో ఉంటుంది. దాంతో ఆ లెట‌ర్‌పై ఐల‌వ్ యూ అని రాసి ఉంటుందా? లేదా? అని మురారి టెన్ష‌న్ ప‌డ‌తాడు. అందులో అదే రాసి ఉండాల‌ని దేవుడిని వేడుకుంటాడు. కానీ అత‌డు కోరుకున్న‌ది ఉండ‌దు.

ఏసీపీ సార్ మీరే ఎప్ప‌టికీ నా దేవుడు అని లెట‌ర్‌లో రాస్తుంది కృష్ణ‌. ఆ అక్ష‌రాలు చ‌దివి నిరాశ‌ప‌డ‌తాడు మురారి. నాపైభ‌క్తి భావం త‌ప్పితే కృష్ణ‌కు ప్రేమ లేదా అని మ‌న‌సులోనే అనుకుంటాడు. ఇంత‌లోనే ముకుంద త‌న చేతికి తొడిగిన రింగ్ క‌నిపిస్తుంది. ఆ ఉంగ‌రాన్ని క‌ష్ట‌ప‌డి తీసేస్తాడు. తాను ఇచ్చిన గిఫ్ట్ చూసి మురారి సంతోష‌ప‌డి ఉంటాడ‌ని కృష్ణ అనుకుంటుంది.

మురారిని సేవ్ చేసిన కృష్ణ‌...

కానీ అత‌డు మాత్రం ప‌రాధ్యానంలో మెట్లు దిగుతూ కింద‌ప‌డ‌బోతాడు. అత‌డిని కృష్ణ సేవ్ చేస్తుంది. ముకుంద త‌న‌కు తొడిగిన ఉంగ‌రాన్ని తీసేసిన విష‌యాన్ని ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా చూపిస్తాడు మురారి. అది చూసి ముకుంద హ‌ర్ట్ అవుతుంది.

ముకుంద‌కు దూరం కావాలంటే కృష్ణ‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని మురారి డిసైడ్ అవుతాడు. కృష్ణ‌పై ప్రేమ‌ను కురిపిస్తాడు. అది చూసి ముకుంద క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మ‌రో దారిలో మురారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ముకుంద డిసైడ్ అవుతుంది. కానీ ముకుంద ఇంటికి తీసుకెళ్ల‌డానికి తండ్రి రావ‌డంతో ఆమెకు షాక్ త‌గులుతుంది. ఆద‌ర్శ్ నుంచి విడాకులు ఇప్పిస్తాన‌ని అనడంతో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point