Kiran Abbavaram New Movie: మూడు సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న లవ్ యాక్షన్ డ్రామా సినిమా గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే..
Kiran Abbavaram New Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జోరుమీదున్నాడు. ప్రస్తుతం మీటర్, రూల్స్ రంజన్‌తో పాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూడు సెట్స్‌పైకి ఉండగానే తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభమైంది.
ట్రెండింగ్ వార్తలు
లవ్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. దర్శకుడిగా అతడికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు వివి.వినాయక్, ఏఎమ్‌రత్నం, సురేష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తోన్నారు. ఈ నెలలోనే కిరణ్ అబ్బవరం మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. శివం సెల్యూలాయిడ్స్ పతాకంపై రవి జోజో జోస్, రాకేష్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
కాగా ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మీటర్ సినిమా ఏప్రిల్7న రిలీజ్ కానుంది. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
టాపిక్