Keerthy Suresh Revolver Rita Movie: రివాల్వ‌ర్ రీటాగా కీర్తిసురేష్ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-keerthy suresh revolver rita movie first look unveiled
Telugu News  /  Entertainment  /  Keerthy Suresh Revolver Rita Movie First Look Unveiled
కీర్తిసురేష్‌
కీర్తిసురేష్‌

Keerthy Suresh Revolver Rita Movie: రివాల్వ‌ర్ రీటాగా కీర్తిసురేష్ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

14 January 2023, 17:47 ISTNelki Naresh Kumar
14 January 2023, 17:47 IST

Keerthy Suresh Revolver Rita Movie: కెరీర్‌లో తొలిసారి యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధ‌మైంది కీర్తిసురేష్‌. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను శ‌నివారం రివీల్ చేశారు.

Keerthy Suresh Revolver Rita Movie: కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు సాఫ్ట్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించింది కీర్తిసురేష్‌. ఫ‌స్ట్ టైమ్ యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మిస్తోన్న కీర్తిసురేష్ తాజాగా రివాల్వ‌ర్ రీటా పేరుతో ఓ సినిమా చేస్తోంది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది కీర్తిసురేష్‌. ఈ పోస్ట‌ర్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వ‌ర్స్‌ ప‌ట్టుకొని కీర్తిసురేష్ క‌నిపిస్తోంది. పెయింటింగ్ టైప్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కీర్తిసురేష్ రివాల్వ‌ర్ రీటా పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఈ సినిమాలో కీర్తిసురేష్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు కే చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది.ఓటీటీని దృష్టిలో పెట్టుకొనే రివాల్వ‌ర్ రీటా సినిమాను రూపొందించిన‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం కీర్తిసురేష్ తెలుగులో ద‌స‌రాతో పాటు భోళాశంక‌ర్ సినిమాలు చేస్తోంది. ద‌స‌రా సినిమాలో నాని హీరోగా న‌టిస్తోన్నాడు. ఇందులో వెన్నెల అనే తెలంగాణ యువ‌తిగా కీర్తిసురేష్ డీ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.