Tollywood Releases This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్‌-keeda cola to maa oori polimera 2 tollywood movies releasing this week in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Keeda Cola To Maa Oori Polimera 2 Tollywood Movies Releasing This Week In Theaters

Tollywood Releases This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 30, 2023 05:53 AM IST

Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ చిన్న సినిమాల జాత‌ర నెల‌కొంది. కీడాకోలా, మా ఊరి పొలిమేర 2 తో పాటు ప‌లు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

కీడా కోలా
కీడా కోలా

Tollywood Releases This Week: ఈ వారం థియేట‌ర్ల ద్వారా ప‌లు చిన్న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్ర‌ధానంగా రూపొందిన ఆ సినిమాలు ఏవంటే...

కీడా కోలా…

బ్ర‌హ్మానందం, చైత‌న్య‌రావు, రాగ్‌మ‌యూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కీడాకోలా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. డిఫ‌రెంట్ స్టోరీతో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే కీడాకోలా సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. హీరో రానా ద‌గ్గుబాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తోన్నాడు. ఈ వారం రిలీజ్ అవుతోన్న చిన్న సినిమాల్లో కీడా కోలాపైనే ఎక్కువ‌గా అంచ‌నాలు నెల‌కొన్నాయి

మా ఊరి పొలిమేర 2…

స‌త్యంరాజేష్‌, బాలాదిత్య‌, గెట‌ప్ శీను, కామాక్షి భాస్క‌ర్ల నాయ‌కానాయిక‌లుగా న‌టించిన‌ మా ఊరి పొలిమేర 2 న‌వంబ‌ర్ 3న రిలీజ్ కానుంది. మా ఊరి పొలిమేర‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సీక్వెల్ రిలీజ్ అవుతోంది.

న‌ర‌కాసుర‌...

ప‌లాస ఫేమ్ ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టిస్తోన్న న‌ర‌కాసుర మూవీ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది. సోష‌ల్ మెసేజ్‌కు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి రూపొందిన ఈ సినిమాలో సంకీర్త‌న విపిన్‌, అప‌ర్ణ జ‌నార్ధ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సెబాస్టియ‌న్ నోవా అకోస్టా ద‌ర్శ‌కుడు.

విధి...

ద‌ర్శ‌క‌ద్వ‌యం శ్రీనాథ్‌, శ్రీకాంత్ తెర‌కెక్కించిన విధి ఈ మూవీ ఈ ఫ్రైడే థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ చిన్న సినిమాలో రోహిత్ నందా, ఆనంది జంట‌గా న‌టించారు.

మరో మూడు సినిమాలు…

అలాగే వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప్లాట్ మూవీ ఈ వీకెండ్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ప్లాట్ సినిమాకు భ‌వ తార‌క ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. వీటితో పాటుగా న‌వంబ‌ర్ 3న కృష్ణ ఘ‌ట్టం, ఒక్క‌సారి ప్రేమించాక సినిమాలు కూడా విడుద‌ల‌కాబోతున్నాయి.

శంక‌ర్‌దాదా ఏంబీబీఎస్ రీ రిలీజ్‌

చిరంజీవి హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ శంక‌ర్ దాదా ఏంబీబీఎస్ న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్‌గా న‌టించింది. ఈ బాలీవుడ్ రీమేక్‌ మూవీలో శ్రీకాంత్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

IPL_Entry_Point

టాపిక్