Bedurulanka 2012 Update: భారీ మొత్తం పలికిన బెదురులంక యూఎస్ హక్కులు.. కార్తికేయ కెరీర్‌లోనే ది బెస్ట్
Bedurulanka 2012 Update: కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. తాజాగా ఈ సినిమా అమెరిక థియెట్రికల్ రైట్స్ కింద భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. దాదాపు 80 లక్షలకు అమ్ముడుపోయింది. నేహా శెట్టి ఈ చిత్రంలో కార్తికేయ సరసన నటించింది.
Bedurulanka 2012 Update: ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అతడు చివరగా రాజా విక్రమార్క సినిమాలో కనిపించాడు. ఇది కాకుండా కోలివుడ్‌లో అజిత్‌తో వలిమై చిత్రంలో విలన్‌గా మెరిశాడు. దీంతో స్వల్ప విరామంతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు కార్తికేయ. అతడు నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంథించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా మంచి రేటుకు అమ్ముడుపోయింది.
ట్రెండింగ్ వార్తలు
అమెరికాలో థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా.. కార్తికేయ కెరీర్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. విలేజ్ గ్రూప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్ర యూఎస్ హక్కులను కొనుగోలు చేసింది. యూఎస్ఏ హక్కుల కింద 80 లక్షలకు కొనుగోలు చేసింది. కార్తికేయ కెరీర్‌లో ఇంత రేటు పలకడం ఇదే తొలిసారి.
అంతేకాకుండా ఫిల్మ్ వర్గాల సమాచారం ఈ సినిమా సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో రైట్స్ కింద మరో రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ న్యూ యాక్షన్ థ్రిల్లర్‌కు అమెరికా మార్కెట్‌లో మంచి ధర పలకడంతో సదరు హీరో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది.
కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరించారు.
సంబంధిత కథనం
టాపిక్