Kangana's Emergency Movie : ఎమర్జెన్సీ సినిమా కోసం ఆస్తులు తనఖా పెట్టా-kangana ranaut reveals she mortgaged all her property for emergency movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana Ranaut Reveals She Mortgaged All Her Property For Emergency Movie

Kangana's Emergency Movie : ఎమర్జెన్సీ సినిమా కోసం ఆస్తులు తనఖా పెట్టా

Anand Sai HT Telugu
Jan 22, 2023 06:58 AM IST

Kangana ranaut Emergency Movie : బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా నిర్మాణంలో చాలా కష్టపడుతోంది. ఉన్న ఆస్తిని కూడా తనఖా పెట్టి.. సినిమా చేస్తోంది. ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ ముగిసింది.

ఎమర్జెన్సీ షూటింగ్
ఎమర్జెన్సీ షూటింగ్ (Instagram)

నటి కంగనా రనౌత్(kangana ranaut) డిఫరెంట్ వ్యక్తిత్వం. బాలీవుడ్ ఇతర హీరోయిన్లలా పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. ఎన్నో వివాదాలు, ఎన్నో డేరింగ్ డెసిషన్స్. ఇవే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఏదైనా అనిపిస్తే.. చేసేయడం కంగనా స్టైల్. ఇప్పుడు ఆమె ఎమర్జెన్సీ సినిమా(Emergency Movie) చేస్తోంది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు పెట్టుకుంది.

ఈ సినిమాలో ఇందిరా గాంధీ(indira gandhi)గా కనిపించడమే కాదు.. దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సమయంలోని 'ఎమర్జెన్సీ' గురించి సినిమా రూపొందుతోంది. ఈ షూటింగ్ పూర్తయిందని కంగనా రనౌత్ ప్రకటించింది. మూవీ కోసం ఆస్తులు కూడా తనఖా పెట్టినట్టుగా కంగనా చెప్పుకొచ్చింది.

కంగనా రనౌత్ నటించిన థాకడ్ సినిమా గత ఏడాది అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రం అనుకున్నంతా స్థాయిలో హిట్ కాలేదు. అయినప్పటికీ కంగనా బలంగా ఎమర్జెన్సీ సినిమా కోసం నిలుచుంది. పూర్తి నమ్మకం పెట్టుకుని పని చేస్తోంది. ఈ సినిమా(Cinema) నిర్మాణంలో చాలా కష్టపడుతోంది. ఉన్న ఆస్తి మెుత్తం తనఖా పెట్టి మరీ.. సినిమా షూటింగ్ పూర్తి చేసింది.

ఎమర్జెన్సీ చిత్రం(Emergency Movie) షూటింగ్ ముగింపు సందర్భంగా కంగనా రనౌత్ ఆమె సోషల్ మీడియా(Social Media)లో ఈ విషయాన్ని పంచుకుంది. ఇందిరా గాంధీ సమయంలో ఎమర్జెన్సీపై ఈ సినిమా తీస్తోంది కంగనా. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. అందులో కంగనా లుక్ చూసి అందరికి ఆశ్చర్యం కలిగింది. పాత్రకు తగ్గట్టుగా మారిపోయింది. ఇందిరా గాంధీలా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఎమర్జెన్సీ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రేయస్ తల్పే, అనుపమ్ ఖేర్, మిల్లింద్ సోమన్, సతీష్ కౌశిక్, మహిమా చౌదరి వంటివారు నటిస్తున్నారు. 1975 నాటి వాస్తవ సంఘటనలను ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రం రూపొందుతోంది.

IPL_Entry_Point

టాపిక్