Avatar 2 Trailer: అవతార్ రెండో ట్రైలర్ రిలీజ్.. కళ్లు చెదిరే విజువల్ వండర్-james cameron avatar the way of water second trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 Trailer: అవతార్ రెండో ట్రైలర్ రిలీజ్.. కళ్లు చెదిరే విజువల్ వండర్

Avatar 2 Trailer: అవతార్ రెండో ట్రైలర్ రిలీజ్.. కళ్లు చెదిరే విజువల్ వండర్

Maragani Govardhan HT Telugu
Nov 22, 2022 12:55 PM IST

Avatar 2 Trailer: జేమ్స్ కేమరూన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అవతార్ సీక్వెల్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ డిసెంబరు 16న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను విడుల చేసింది చిత్రబృందం.

అవతార్ 2 రెండో ట్రైలర్ రిలీజ్
అవతార్ 2 రెండో ట్రైలర్ రిలీజ్

Avatar 2 Trailer: అవతార్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసే వసూళ్లతో దుమ్మురేపింది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సీక్వెళ్లను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4 అంటూ ఇలా మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో ముందుగా రెండో భాగమైన అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఈ ఏడాది డిసెంబరు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా అవతార్ 2 చిత్రానికి చెందిన రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

పండోరా గ్రహం అందాలను మరోసారి చూపిస్తూ విజువల్ వండర్‌గా దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించినట్లు ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కళ్లు మిరుమిట్లు గొలిపే హంగులు, ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. ఇది అసలు నిజంగా గ్రాఫిక్సేనా అంటే నమ్మశక్యం కానీ రీతిలో తెరెకెక్కించారు. ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాలను కలిగించే విధంగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ట్రైలర్ చూపించారు

ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. పండోరా గ్రహంపై మనుషుల విధ్వంసాన్ని ఆపేందుకు నావీ అనే తెగ ఏ విధంగా పోరాడింది అనేది అవతార్ మొదటి భాగం కథ. అయితే రెండో భాగంలో నావీ తెగ సముద్రం దగ్గర జీవిస్తున్న మరో తెగను కలిసి తమకు సాయం చేయాల్సింది కోరుకుంటున్నట్లు, సముద్రంలో వారి నైపుణ్యాలను నేర్చుకున్న విధానాన్ని చూపించారు. కాబట్టి ఈ రెండో భాగం నేల, నీరు గురించి తెరకెక్కినట్లు తెలుస్తోంది.

జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ విభిన్న భాషల్లో ఈ సినిమా అనువాదం కానుంది. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్దానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లెట్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం