Bigg Boss 6 Telugu 2nd week Nominations: అశుద్ధంపై రాయేస్తే తిరిగి మనపైనే పడుతుంది.. గీతూ-రేవంత్ హీటెడ్ ఆర్గ్యూమెంట్..!-heated arguments in bigg boss season 6 telugu second week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Heated Arguments In Bigg Boss Season 6 Telugu Second Week Nominations

Bigg Boss 6 Telugu 2nd week Nominations: అశుద్ధంపై రాయేస్తే తిరిగి మనపైనే పడుతుంది.. గీతూ-రేవంత్ హీటెడ్ ఆర్గ్యూమెంట్..!

Maragani Govardhan HT Telugu
Sep 13, 2022 12:18 PM IST

Bigg Boss 6 Telugu Nominations: బిగ్‌బాస్ సీజన్ 6 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రేవంత్, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, రాజశేఖర్, మెరీనా-రోహిత్, షానీలు నామినేట్ అయ్యారు.

బిగ్‌బాస్ రెండో వారం నామినేషన్లు
బిగ్‌బాస్ రెండో వారం నామినేషన్లు

Bigg Boss 6 Telugu Second Week Nominations: బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలాగోలా పూర్తయింది. ఈ సీజన్‌లో మొదటి రోజు నుంచే వాదనలు, గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే ఫస్ట్ వీక్ ఎవ్వరూ ఎలిమినేట్ కావట్లేదని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో రెండో వారం నుంచి గొడవ పడండి అని చెప్పకనే చెబుతూ సంకేతాలిచ్చారు. ఫలితంగా రెండో వారం మొదటి రోజు నామినేషన్స్ నుంచే అవి ప్రారంభమయ్యాయి. వాడి వేడి చర్చలు, కౌంట్లు, సెటైర్లతో రెండో వీక్ నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి.

రెండో వారం నామినేషన్స్ భాగంగా.. ఇంటి సభ్యులు తాము నామినేట్ చేసే ఒక కంటెస్టెంట్ ఫొటొను కుండకు అతికించి బావిలో పడేయాలి. మొదటగా ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేస్తూ అతనితో పెద్దగా బాండింగ్ లేదని, ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయినా పర్లేదు అనే ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. ఇందుకు కౌంటర్‌గా హౌస్‌లో గేమ్ ఆడని వాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో వెళ్లిపోవాలా అంటూ ఆదిరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. ఆడని వాళ్లు వెళ్లిపోవాలి? అంటూ ఆరోహి సమాధానమిచ్చింది. అయితే నేను ఆడాను.. నువ్వు ఆడలేదు అంటూ ఆరోహిని ప్రశ్నించాడు.. ఇందుకు ఆమె నేనా నేనా అంటూ తిరిగి అతడిని ప్రశ్నించింది. ఇందుకు ఆది కూడా మీరు ఏమి ఇరగదీశారో చెప్పండి అంటూ వాదించాడు. ఇద్దరి మధ్య కాస్త వాదన జరిగింది.

అయితే ఇంత ఆర్గ్యూమెంట్ జరిగినప్పటికీ.. ఆరోహిని కాకుండా.. రోహిత్-మెరినాను నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ ఇవ్వడం కామెడీగా అనిపించింది. అందరితీ ఒక బుర్ర పనిచేస్తుంటే.. వాళ్లది రెండు బుర్రలు పనిచేస్తున్నాయని, ఇది బిగ్‌బాస్ నిర్ణయం అయినప్పటికీ తాను వాళ్లనే నామినేట్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.

అనంతరం శ్రీహాన్ గలాట గీతూను నామినేట్ చేస్తూ ఈ మగాళ్లకు బుద్ధి లేదని అన్నావ్.. అందరూ ఏం చేశారు అంటూ నిలదీశాడు.. దీంతో తన ఉద్దేశం అది కాదని.. ప్రతికుక్కకి ఓ రోజు వస్తుందంటే కుక్కకు ఓ రోజు వస్తుందని కాదు.. అది జస్ట్ స్టేట్మెంట్ అంటూ తన వాదనను సమర్థించే ప్రయత్నం చేసింది. అన్న మాటే తప్పే అయినప్పటికీ.. దాన్ని వేరే ఉదాహరణతో తనను తాను సమర్థించుకోవడం సరికాదని అనిపించింది.

గీతూ-రేవంత్ హీటెడ్ ఆర్గ్యూమెంట్..

నామినేషన్ ప్రక్రియలో ఈ ఎపిసోడ్‌కు హైలెట్ అంటే గీతూ-రేవంత్ మాటల యుద్ధమే. నిన్ను నామినేట్ చేయాలంటేనే ఛీఛీ అనే ఫీలింగ్ కలిగింది. నీతో మాట్లాడటం నాకు అసహ్యం. అశుద్ధం మీద రాయి వేస్తే మనమీదే పడుతుంది. నువ్వు అలాంటిదానివే అంటూ రేవంత్.. గీతూను ఉద్దేశించి మాట్లాడాడు. ఇందుకు గీతూ.. కూడా సేమ్ ఫీలింగ్ అంటూ అతడి మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఎక్కువ మంది రేవంత్, గీతూనే నామినేట్ చేశారు. కీర్తి, అర్జున్, గీతూ, శేఖర్‌లు రేవంత్‌ను నామినేట్ చేయగా.. నేహా, చలాకీ చంటి, సుదీప, ఆర్జే సూర్య, రేవంత్‌లు గీతూను నామినేట్ చేశారు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఫైమాను వాసంతి నామినేట్ చేయడం గమనార్హం. మెరీనా-రోహిత్.. తమకు సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేసిన ఆదిరెడ్డి నామినేట్ చేశారు.

కెప్టెన్‌కు అదిరిపోయే పవర్..

సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే కారణంతో అభినయ, శ్రీ సత్య షానీని నామినేట్ చేశారు. ఇందుకు షానీ కూడా ఇలా ఉండటం తన వ్యక్తిత్వమని.. నాకు కోపం రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.. కాబట్టి దయచేసి నాకు కోపం వచ్చేలా ప్రయత్నించి.. నాలో ఉన్న ఆగ్రహాన్ని బయటకు తీయాల్సిందిగా కోరుతున్నా అంటూ వినయంగానే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అతడు అభినయను నామినేట్ చేశాడు. చివర్లో బాలాధిత్య కెప్టెన్ అయిన కారణంగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో మీరు బయటకు వెళ్లరనే నమ్మకంతో షానీ, రాజశేఖర్‌లను నామినేట్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. మొత్తంగా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రేవంత్, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, రాజశేఖర్, మెరీనా-రోహిత్, షానీలు నామినేట్ అయ్యారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం