Guppedantha Manasu May 9th Episode: శైలేంద్ర దొంగ బుద్ధి రిషికి తెలిసిందా? - త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా?-guppedantha manasu may 9th episode shailendra threatens jagathi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 9th Episode Shailendra Threatens Jagathi

Guppedantha Manasu May 9th Episode: శైలేంద్ర దొంగ బుద్ధి రిషికి తెలిసిందా? - త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా?

HT Telugu Desk HT Telugu
May 09, 2023 10:58 AM IST

Guppedantha Manasu: శైలేంద్ర‌, దేవ‌యాని క‌లిసి రిషికి ఎలాంటి ఆప‌ద త‌ల‌పెడ‌తారో అని జ‌గ‌తి త‌ల్ల‌డిల్లిపోతుంది. త‌ల్లి సంఘ‌ర్ష‌ణ‌ను రిషి అర్థం చేసుకున్నాడా లేదా అన్న‌ది తెలియాలంటే నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ చూడాల్సిందే...

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu: రిషి చేతిలో నుండి డీబీఎస్‌టీ కాలేజీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప‌ద‌విని లాగేసుకోవాల‌ని త‌ల్లితో క‌లిసి శైలేంద్ర ప్లాన్‌ వేస్తాడు. ఆ ప‌నిని జ‌గ‌తి చేతే చేయించాల‌ని అనుకుంటారు. తాము చెప్పిన‌ట్లు న‌డుచుకోక‌పోతే రిషిని చంపేస్తామ‌ని బెదిరిస్తారు. దాంతో జ‌గ‌తి ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను మ‌హేంద్ర‌, వ‌సుధార ఓదార్చుతారు.

అంత‌లోనే రిషి అక్క‌డికి రావ‌డంతో అత‌డి గుండెల‌పై వాలి ఏడుస్తుంది. ఆ స‌మ‌యంలో రిషిలో త‌ల్లి ప‌ట్ల ఉన్న దాగి ఉన్న ప్రేమ బ‌య‌ట‌కు వ‌స్తుంది. త‌ల్లి ప్రేమ‌ను రిషి గుర్తించాడా? మేడ‌మ్ అంటూఇన్నాళ్లు జ‌గ‌తిని పిలిచిన రిషి ఆమెను అమ్మ అని మొద‌టిసారి పిలిచాడా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

అంతే కాకుండా శైలేంద్ర‌, దేవ‌యాని నిజ‌స్వ‌రూపం గురించి జ‌గ‌తి చెప్పిన మాట‌ల‌ను రిషితో పాటు మ‌హేంద్ర న‌మ్ముతారా? త‌ప్పుడు మాట‌లుగా కొట్టిపారేస్తారా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. త‌న ప్లాన్ గురించి రిషితో చెబితే అత‌డిని చంపేస్తాన‌ని జ‌గ‌తిని బెదిరించిన మ‌హేంద్ర అన్న‌ట్లుగానే చేశాడా అన్న‌ది కూడా మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

డిస్నీ హాట్‌స్టార్‌లో నేటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆల‌స్యం

ప్ర‌జెంట్ టాప్ టెన్ తెలుగు సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు కొన‌సాగుతోంది. ఈ సీరియ‌ల్‌ను టీవీలో ఫాలో అయ్యే ఆడియెన్స్ సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. అంతే కాకుండా ఓటీటీలో చాలా మంది ఆడియెన్స్ ఈ సీరియ‌ల్‌ను చూస్తుంటారు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ప్ర‌తి రోజు ఉద‌యం ఏడు గంట‌ల లోపే కొత్త ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ కోసం అప్‌లోడ్ చేస్తుంటారు. మంగ‌ళ‌వారం మాత్రం టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా సీరియ‌ల్‌ను అప్‌లోడ్ చేయ‌క‌పోవ‌డంలో సీరియ‌ల్ ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు.

IPL_Entry_Point