Guppedantha Manasu May 16th Episode: శైలేంద్రకు క్షమాపణలు చెప్పిన వసుధార - రిషి ముందు దోషిగా నిల‌బ‌డ్డ జ‌గ‌తి-guppedantha manasu may 16th episode vasudhara apologizes to shailendra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 16th Episode: శైలేంద్రకు క్షమాపణలు చెప్పిన వసుధార - రిషి ముందు దోషిగా నిల‌బ‌డ్డ జ‌గ‌తి

Guppedantha Manasu May 16th Episode: శైలేంద్రకు క్షమాపణలు చెప్పిన వసుధార - రిషి ముందు దోషిగా నిల‌బ‌డ్డ జ‌గ‌తి

HT Telugu Desk HT Telugu
May 16, 2023 08:28 AM IST

Guppedantha Manasu May 16th Episode: జ్యూస్‌లో విషం క‌లిపి రిషిని చంపాల‌ని శైలేంద్ర‌, దేవ‌యాని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారు. ఆ జ్యూస్ రిషి తాగ‌కుండా అడ్డుకుంటుంది జ‌గ‌తి. ఈ ప్ర‌య‌త్నంలో జ‌గ‌తి అంద‌రి ముందు దోషిగా నిల‌బ‌డాల్సివ‌స్తుంది.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 16th Episode: రిషి, వ‌సుధార‌ల ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా జ‌రుగుతుంది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో అంద‌రి కంటే ఎక్కువ‌గా శైలేంద్ర హ‌డావిడి చేస్తాడు. తానే ద‌గ్గ‌రుండి అన్ని ప‌నులు చేస్తుంటాడు. రిషి, వ‌సుధార‌ల ఎంగేజ్‌మెంట్ స‌జావుగా సాగ‌డంతో జ‌గ‌తి, మ‌హేంద్ర‌తో పాటు వ‌సుధార త‌ల్లిదండ్రులు కూడా ఆనంద‌ప‌డ‌తారు. పెద్ద‌వాళ్ల ఆశీర్వాదం తీసుకోమ‌ని పూజారి రిషి, వ‌సుధార‌ల‌కు చెబుతాడు.

జ‌గ‌తి ప‌క్క‌నే ఉన్నా ఆమెను కాద‌ని దేవ‌యాని ఆశీర్వాదం తీసుకోవాల‌ని రిషి అనుకుంటాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌ను శైలేంద్ర త‌ప్పు ప‌డ‌తాడు. మొద‌టి త‌ల్లిదండ్రుల‌ ఆశీర్వాదం తీసుకోవాల‌ని అత‌డిని ఒప్పిస్తాడు. అన్న‌య్య చెప్పిన‌ట్లుగానే రిషి చేస్తాడు.

జ్యూస్‌లో విషం క‌లిపిన దేవ‌యాని...

రిషి, వ‌సుధార కోసం జ్యూస్ తీసుకుర‌మ్మ‌ని త‌ల్లి దేవ‌యానిని కోర‌తాడు శైలేంద్ర‌. అత‌డి చెప్పిన‌ట్లుగానే జ్యూస్ తీసుకురావ‌డానికి కిచెన్‌లోకి వెళ్లిన దేవ‌యాని అందులో విషం క‌లుపుతుంది. అది ధ‌ర‌ణి చూస్తుంది. ధైర్యం చేసి ఆ విష‌యాన్ని జ‌గ‌తితో చెబుతుంది. ఇంత‌లోనే జ్యూస్ తీసుకొని దేవ‌యాని స్టేజ్‌పైకి ఎక్కుతుంది. ఆ జ్యూస్ ను ఒక‌రికొక‌రు తాగించుకోవాల‌ని రిషి, వ‌సుధార‌ల‌తో అంటాడు

శైలేంద్ర‌. అందుకు వ‌సు నిరాక‌రిస్తుంది. కానీ రిషి కోర‌డంతో కాద‌న‌లేక‌పోతుంది. ఆ జ్యూస్ తాగుతోన్న రిషికి ఏమ‌వుతుందోన‌ని జ‌గ‌తి, ధ‌ర‌ణి కంగారుప‌డ‌తారు. ఆ జ్యూస్‌ను మొద‌ట తాగిన రిషి కింద‌ప‌డిపోతాడు. ఇంత‌లోనే జ‌గ‌తి గ‌ట్టిగా రిషి అని పిలుస్తూ ఆ క‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆమె అరుపుకు వేదిక వ‌ద్ద ఉన్న అంద‌రూ కంగారు ప‌డ‌తారు. ఏమైంద‌ని అడిగితే స‌మాధానం చెప్ప‌దు.

శైలేంద్ర కొత్త ప్లాన్‌...

ఆమె క‌ళ్ల ముందే జ్యూస్‌ను రిషికి తాగించ‌డానికి వ‌సుధార సిద్ధ‌మ‌వుతుంది. ఇంత‌లోనే జ‌గ‌తి వారిని అడ్డుకుంటుంది. ఆ జ్యూస్ తాగ‌కూడ‌ద‌ని, అందులో విషం ఉంద‌ని అంటుంది. ఆమె మాట‌ల‌కు అక్క‌డున్న వారంద‌రూ షాక్ అవుతారు.

ఆ జ్యూస్ తీసుకొచ్చింది నేనే కదా...అంటే అందులో నేనే విషం క‌లిపినా...లేదంటే నా కొడుకు శైలేంద్ర ప్లాన్ చేసి విషం క‌లిపాడా అంటూ జ‌గ‌తిపై దేవ‌యాని కోప‌గించుకుంటుంది. నాపైనే అనుమానప‌డుతుంది కాబ‌ట్టి ఆ అనుమానం తీర‌డానికి నేనే ఆ జ్యూస్ తాగేస్తాన‌ని అంటాడు శైలేంద్ర‌. అలాగే చేస్తాడు. అత‌డికి ఏమ‌వుతుందోన‌ని అంద‌రూ భ‌య‌ప‌డ‌తారు. కానీ ఆ జ్యూస్ తాగిన శైలేంద్ర‌కు క్షేమంగా ఉంటాడు.

దోషిగా జ‌గ‌తి...

దాంతో జ‌గ‌తి అంద‌రి ముందు దోషిగా నిల‌బ‌డాల్సివ‌స్తుంది. అంద‌రూ ఆమెను త‌ప్పుప‌డ‌తారు. ఎందుకు మాపై నింద వేశార‌ని జ‌గ‌తిని ప్ర‌శ్నిస్తాడు శైలేంద్ర‌. కానీ అత‌డి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా జ‌గ‌తి సైలెంట్‌గా ఉంటుంది. జ‌గ‌తికి వ‌సుధార స‌పోర్ట్‌గా నిలుస్తుంది.

ఏదో ఆధారం ఉంటేనే జ‌గ‌తి అలా మాట్లాడింద‌ని శైలేంద్ర‌తో అంటుంది. అందుకు అత‌డు ఆధారాల‌తో కాదు నా మీద, మా మ‌మ్మీ మీద అనుమానంతో మాట్లాడింద‌ని జ‌గ‌తిని అవ‌మానిస్తాడు. రిషి త‌న సొంత త‌మ్ముడిలా చూసుకున్నాన‌ని, అత‌డి ఆనందం కోస‌మే ఎంగేజ్‌మెంట్‌ను తానే ద‌గ్గ‌రుండి చేశాన‌ని అలాంటిది నేను ఎందుకు అత‌డిని చంపాల‌ని చూస్తానంటూ దొంగ క‌న్నీరు కారుస్తాడు.

జ‌గ‌తిని త‌ప్పుప‌ట్టిన రిషి...

షిని క‌న్న కొడుకులా పెంచాన‌ని, అలాంటిది అత‌డికి విషం పెట్టి ఎలా చంపుతానంటూ దేవ‌యాని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో రిషి కూడా జ‌గ‌తినే త‌ప్పుప‌డ‌తాడు. వ‌సుధార మ‌ధ్య‌లో క‌ల్పించుకుంటే ఆమెపై అరుస్తాడు. అనుమానించ‌డానికైనా ఒక హ‌ద్దు ఉండాలి అంటూ జ‌గ‌తిపై ఫైర్ అవుతాడు.

ఒక వేళ మీ అనుమానం నిజ‌మే అయితే పెద్ద‌మ్మ నా ప్రాణాల‌కు కోరుకుంటే సంతోషంగా ఇస్తాన‌ని అంటాడు. దేవ‌యానిని అనుమానిస్తే న‌న్ను అనుమానించిన‌ట్లే అని రిషి చెబుతాడు. జ‌గ‌తి చేసిన త‌ప్పుకు తాను క్ష‌మాప‌ణ చెబుతాన‌ని వ‌సుధార అంటుంది. కానీ రిషి మాత్రం జ‌గ‌తినే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుప‌డ‌తాడు. చివ‌ర‌కు వ‌సుధార‌నే శైలేంద్ర‌, దేవ‌యానికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది..

IPL_Entry_Point