Guppedantha Manasu May 10th Episode: రిషిని వెన్నుపోటు పొడ‌వ‌డానికి శైలేంద్ర కొత్త ప్లాన్-guppedantha manasu may 10th episode rishi vasudhara worried on jagathi behaviour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 10th Episode Rishi Vasudhara Worried On Jagathi Behaviour

Guppedantha Manasu May 10th Episode: రిషిని వెన్నుపోటు పొడ‌వ‌డానికి శైలేంద్ర కొత్త ప్లాన్

HT Telugu Desk HT Telugu
May 10, 2023 08:55 AM IST

Guppedantha Manasu May 10th Episode రిషి వెంటే ఉంటూ అత‌డిని దెబ్బ‌కొట్ట‌డానికి మ‌రో మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడు శైలేంద్ర‌. అదేమిటో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ చూడాల్సిందే...

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 10th Episode క‌న్న కొడుక్కి ఏం జ‌రుగుతుందో అనే భ‌యంతో జ‌గ‌తి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసి రిషి, మ‌హేంద్ర‌తో పాటు వ‌సుధార కూడా టెన్ష‌న్ ప‌డ‌తారు. రిషి ప్రాణాలకు శైలేంద్ర అపాయం త‌ల‌పెట్ట‌నున్నాడ‌ని తెలిసినా త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌పెట్టే ప‌రిస్థితి జ‌గ‌తికి ఉండ‌దు. ఏమైంద‌ని రిషి, మ‌హేంద్ర ఎంత అడిగినా శైలేంద్ర‌, దేవ‌యానిల ప‌న్నాగం గురించి జ‌గ‌తి వారికి చెప్ప‌దు.

ఆ త‌ర్వాత అక్క‌డికి దేవ‌యాని ఎంట్రీ ఇస్తుంది. రిషి, మ‌హేంద్ర సీరియ‌స్‌గా ఉండ‌టం చూసి ఏం జ‌రిగింద‌ని అమాయ‌కంగా నాట‌కం ఆడుతూ రిషి వ‌ద్ద మంచి మార్కులు కోట్టేస్తుంది. ఆమెకు శైలేంద్ర కూడా వంత‌పాడ‌తాడు. తామే ఈ వెన‌కుండి ఈ నాట‌కాన్ని న‌డిపిస్తున్నామ‌నేది తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు.

రిషికి స‌హాయంగా శైలేంద్ర‌...

ఆ త‌ర్వాత కాలేజీలో త‌న‌పై ఎటాక్ చేసిన వ్య‌క్తికి సంబంధించిన ఆధారాలు ప‌ట్టుకోవాల‌ని రిషి అనుకుంటాడు. సీసీ టీవీ ఫుటేజ్ తిప్పిస్తాడు. అటాక్ చేసిన వ్య‌క్తిని రిషి, వ‌సుధార గుర్తుప‌డ‌తారు. అత‌డిని రిషి ప‌ట్టుకుంటాడు. ఈ విష‌యంలో రిషికి హెల్ప్‌గా ఉండ‌మ‌ని శైలేంద్ర‌కు అత‌డి తండ్రి ఫ‌ణీంద్ర సూచిస్తాడు. ఆ ముసుగు దొంగ‌ను రిషి చాలా కొడ‌తాడు.

కానీ తెలివిగా అక్క‌డే ఉన్న శైలేంద్ర అత‌డు నోరు విప్ప‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు. దాంతో శైలేంద్ర నిజ‌స్వ‌రూపం రిషికి తెలిసే ఛాన్స్ కొద్దిలో మిస్ అవుతుంది. త‌న‌పై అటాక్ చేసింది సౌజ‌న్య‌రావు అనుకొని రిషి అత‌డికి వార్నింగ్ ఇస్తాడు.

శైలేంద్ర వెన్నుపోటు….

నేటి ఎపిసోడ్‌లో రిషి వెన్నంటి ఉండి అత‌డికి వెన్నుపోటు పొడ‌వ‌డానికి శైలేంద్ర కొత్త స్కెచ్ వేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ శైలేంద్ర వేసిన మాస్ట‌ర్ ప్లాన్ ను రిషి ఎలా ఎదుర్కొంటాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌బోతున్న‌ది.

మ‌రోవైపు జ‌గ‌తి మ‌న‌సులో ఉన్న బాధ‌ను వ‌సుధార క‌నిపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. శైలేంద్ర‌, దేవ‌యాని కార‌ణంగానే ఆమె బాధ‌ప‌డుతోన్న‌ట్లు గ్ర‌హించిన వ‌సుధార వారిని ఎదుర్కొంటూ రిషి, జ‌గ‌తిల‌కు స‌హాయంగా నిల‌బ‌డాల‌ని డిసైడ్ అవుతోన్న‌ట్లుగా నేటి ఎపిసోడ్స్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point