Guppedantha Manasu June 3rd Episode: కేడీ బ్యాచ్ నుంచి వ‌సుధార‌కు ఆప‌ద - శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్‌-guppedantha manasu june 3rd episode jagathi cautions to shailendra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu June 3rd Episode Jagathi Cautions To Shailendra

Guppedantha Manasu June 3rd Episode: కేడీ బ్యాచ్ నుంచి వ‌సుధార‌కు ఆప‌ద - శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్‌

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 08:28 AM IST

Guppedantha Manasu June 3rd Episode: రిషి ఇంటి నుంచి వెళ్లిపోయినా ఎండీ సీట్ త‌న‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో శైలేంద్ర అస‌హ‌నానికి లోన‌వుతుంటాడు. ఎండీ సీట్ కోసం మ‌హేంద్ర‌ను కూడా చంపాల‌ని డిసైడ్ అవుతాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే....

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

కొత్త కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగంలో చేరిన రోజే వ‌సుధార‌కు స్టూడెంట్స్ ముందు దారుణ‌ అవ‌మానం జ‌రుగుతుంది. టైమ్ టేబుల్ ఫాలో కాకుండా వ‌చ్చావా అంటూ ఓ లెక్చ‌ర‌ర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు స్టూడెంట్స్ ముందే ఆమెను నానా మాట‌లు అంటాడు. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని ప్రిన్సిపాల్‌తో చెబుతూ సీరియ‌స్ అవుతుంది వ‌సుధార‌. కానీ వ‌సుధార‌ను అవ‌మానించింది లెక్చ‌ర‌ర్ కాద‌నే నిజాన్ని ఆమెకు ప్రిన్సిపాల్ వివ‌రిస్తాడు. అదంతా కేడీ బ్యాచ్ ప‌ని అంటాడు.

కేడీ బ్యాచ్ ప్లాన్

డ్రైవ‌ర్‌ను లెక్చ‌ర‌ర్ అని న‌మ్మించి వ‌సుధార‌ను బోల్తా కొట్టించింది కేడీ బ్యాచ్ అని అంటాడు. ప్రిన్సిపాల్ మాట‌ల‌తో వ‌సుధార షాక్ అవుతుంది. మ‌రోసారి వ‌సుధార‌ను ఫూల్ చేసి ఆమెను కాలేజీ నుంచి పంపించాల‌ని కేడీ బ్యాచ్ డిసైడ్ అవుతారు. కాలేజీలో అల్ల‌రి చేయ‌డ‌మే కేడీ బ్యాచ్ ప‌ని. కేడీ బ్యాచ్‌లో రోహిత్‌, రేణుక‌, ప్ర‌సాద్‌, పాండ్య‌న్ మెంబ‌ర్స్‌గా ఉంటారు.

కేడీ బ్యాచ్‌కు పాండ్య‌న్ లీడ‌ర్‌గా ఉంటాడు. లెక్చ‌ర‌ర్స్‌ను చ‌దువు చెప్ప‌కుండా మిగిలిన స్టూడెంట్స్‌ను చ‌ద‌వ‌కుండా చేస్తున్నార‌నే నిజాన్ని మిగిలిన లెక్చ‌ర‌ర్స్ ద్వారా వ‌సుధార తెలుసుకుంటుంది. ప్రిన్సిపాల్‌తో పాటు మిగిలిన లెక్చ‌ర‌ర్స్ కూడా కేడీ బ్యాచ్ పేరు వింటే భ‌య‌ప‌డుతార‌ని ఆమెకు అర్థ‌మ‌వుతుంది. వారికి భ‌య‌ప‌డి చాలా మంది లెక్చ‌ర‌ర్స్ ఉద్యోగాల్ని వ‌దిలిపెట్టి వెళ్లిపోయార‌ని చెప్పి వ‌సుధార‌ను భ‌య‌పెట్టిస్తారు. కేడీ బ్యాచ్‌ను బాగు చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని అంటారు.

శైలేంద్ర అస‌హ‌నం...

ఎన్ని బాధ‌లు పెట్టినా ఎండీ సీట్‌ను జ‌గ‌తి త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో శైలేంద్ర అస‌హ‌నానికి లోన‌వుతాడు. అదే విష‌యాన్ని జ‌గ‌తితో అంటాడు. డీబీఎస్‌టీ కాలేజీని అప్ప‌గించేది లేద‌ని మ‌రోసారి శైలేంద్ర‌కు గ‌ట్టిగా బ‌దులిస్తుంది జ‌గ‌తి. రిషి వ‌స్తాడ‌ని ఇంకా ఊహ‌ల్లో బ‌తుకుతున్నావు. వాడు ఈ జ‌న్మ‌లో రాడు. త‌న కోసం ఎదురుచూసే ఓపిక నీకు ఉందేమో కానీ, ఎండీ సీట్ కోసం ఎదురుచూసే ఓపిక నాకు లేదు. ఇన్ని రోజులు అర్థం చేసుకుంటావ‌ని వ‌దిలివేశాన‌ని జ‌గ‌తికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌.

ఆటలు సాగవు…

ఇక‌పై అలా ఉండ‌ద‌ని బెదిరిస్తాడు. అప్పుడు రిషిని దూరం చేశాను. ఇప్పుడు నీకు కావాల్సిన వాళ్ల‌ను శాశ్వ‌తంగా దూరం చేస్తాన‌ని భ‌య‌పెడ‌తాడు. కానీ జ‌గ‌తి మాత్రం అత‌డి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌దు. నువ్వు వేషాలు వేసినా నీ ఆట‌లు నా ద‌గ్గ‌ర సాగ‌వు. నువ్వు భ‌య‌పెట్టాల‌ని చూసిన భ‌య‌ప‌డ‌ను.

నువ్వు నా కొడుకుతో పాటు వ‌సుధార‌ను నాకు దూరం చేశాడు. నా భ‌ర్త‌ను నాతో మాట్లాడ‌కుండా చేశావు. అయినా ఏం చేయ‌కుండా వ‌దిలివేశాను. నువ్వు ఇంత నీచుడివ‌ని, ఇంట్లో జ‌రిగిన ప్ర‌తి సంఘ‌ట‌న‌కు నువ్వే కార‌ణ‌మ‌నే విష‌యం ఫ‌ణీంద్ర‌కు తెలిస్తే త‌న‌కు ప్రాణాల‌కు ముప్పు అని ఇన్నాళ్లు వ‌దిలిపెట్టాన‌ని అంటుంది. అంతే త‌ప్ప నిన్ను ఎదుర్కోవ‌డం తెలియ‌క కాద‌ని అంటుంది.

రిషి తిరిగి వ‌స్తాడు...

రిషి ప్రాణాల‌ను కాపాడ‌టానికే ఎండీ సీట్‌కు అత‌డిని దూరం చేశాన‌ని, కానీ త‌న‌కు దూరం అవుతాడ‌ని అనుకోలేద‌ని జ‌గ‌తి అంటుంది. రిషి తిరిగి వ‌స్తే తాను కాపోయినా వ‌సు అయినా అత‌డికి అన్ని నిజాలు చెబుతుంద‌ని, అప్పుడు నీ ప‌రిస్థితి ఏమిటో ఆలోచించుకోమ‌ని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తుంది జ‌గ‌తి. జ‌గ‌తి మాట‌ల‌కు బ‌తికిఉన్నోడికైతే చెప్పొచ్చు. చ‌చ్చినోడికి ఎలా చెబుతావంటూ మ‌న‌సులోనే అనుకుంటాడు శైలేంద్ర‌. మ‌హేంద్ర‌కు ఏదైనా ఆప‌ద త‌ల‌పెట్టాల‌ని చూస్తే నీ నిజ‌స్వ‌రూపం మొత్తం బ‌య‌ట‌పెడ‌తాడ‌న‌ని శైలేంద్ర‌ను రివ‌ర్స్ వార్నింగ్ ఇస్తుంది జ‌గ‌తి.

త‌డ‌బ‌డ్డ శైలేంద్ర‌...

రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలుసు క‌దా అని శైలేంద్ర‌ను అడుగుతుంది జ‌గ‌తి. ఆమె మాట‌ల‌కు శైలేంద్ర త‌డ‌బ‌డిపోతాడు. రిషిని చంపిన విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌ని భ‌య‌ప‌డ‌తాడు.నాకు తెలియ‌ద‌ని అంటాడు. అందుకు రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే నాకు తెలుస్తుంద‌ని జ‌గ‌తి శైలేంద్ర‌తో అంటుంది. నాతో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని మాట‌ల‌తోనే శైలేంద్ర‌ను బెదిరించి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

ఎండీ సీట్ ద‌క్కించుకోవాల‌నే త‌న ఆశ తీర‌క‌పోవ‌డంతో శైలేంద్ర కోపం మ‌రింత పెరుగుతుంది. రిషిని ఇంటి నుంచి పంపించ‌డం వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ఉ ప‌యోగం లేద‌నే నిజాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతారు. జ‌గ‌తిని త‌క్కువ‌గా అంచ‌నా వేశాన‌ని శైలేంద్ర అనుకుంటాడు. ఆమె అడ్డును ఎలాగైనా తొల‌గించుకోవాల‌ని డిసైడ్ అవుతాడు.

మ‌హేంద్ర‌ను చంపాల‌ని ప్లాన్‌...

రిషి తిరిగి వ‌స్తే అంద‌రూ క‌లిసిపోతార‌ని, జ‌న్మ‌లో డీబీఎస్‌టీ కాలేజీకి త‌న కొడుకు ఎండీ కాలేడ‌ని దేవ‌యాని బాధ‌ప‌డుతుంది. పేరుకే మ‌నం ఇంట్లో పెద్ద దిక్కులా ఉంటామ‌ని, ఇంట్లో పెత్త‌నం మాత్రం వారి చేతుల మీదుగానే జ‌రుగుతుంద‌ని, అది త‌ట్టుకోవ‌డం త‌న వ‌ల్ల కాద‌ని కొడుకుతో చెబుతుంది.

రిషి రాక‌ముందే కాలేజీ మ‌న సొంతం చేసుకోవాల‌ని శైలేంద్ర‌తో అంటుంది. రిషిని చంపిన విష‌యాన్ని త‌ల్లి ద‌గ్గ‌ర కూడా దాస్తాడు శైలేంద్ర‌. జ‌గ‌తి నుంచి కాలేజీని ద‌క్కించుకోవాలంటే మ‌హేంద్ర‌ను చంపేయ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌నిత‌ల్లితో అంటాడు శైలేంద్ర‌.

అత‌డి మాట విని దేవ‌యాని షాక్ అవుతుంది. మ‌హేంద్ర ప్రాణాలు పోతేనే జ‌గ‌తి త‌మ దారి నుంచి అడ్డు త‌ప్పుకుంటుంద‌ని శైలేంద్ర చెబుతాడు. అప్పుడే జ‌గ‌తి త‌న‌కు ఎదురుతిర‌గ‌ద‌ని అంటాడు. కొడుకు ఆలోచ‌న‌ల్ని దేవ‌యాని త‌ప్పు ప‌డుతుంది.

ఎన్ని ఘోరాలు చేసినా జ‌గ‌తి ఎదురుతిర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం మ‌హేంద్రఅని, అత‌డి అడ్డు తొలిగిపోతే ఆమె పులిగా మారిపోతుంద‌ని, ఆప‌డం మ‌న త‌రం కాద‌ని శైలేంద్ర‌కు హితబోధ చేస్తుంది దేవ‌యాని. . మ‌హేంద్ర‌కు ఏదైనా ఆప‌ద త‌ల‌ప‌డితే తండ్రి కూడా గుండె ఆగి చ‌చ్చిపోతాడ‌ని అంటుంది. త‌ల్లి మాట‌ల‌ను శైలేంద్ర తేలిగ్గా తీసుకుంటాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point