Grey Telugu Movie Review: గ్రే మూవీ రివ్యూ - రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Grey Movie Review: అలీరెజా, అరవింద్ కృష్ణ, ఊర్వశిరాయ్ కీలక పాత్రలను పోషించిన గ్రే మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Grey Telugu Movie Review: అలీరెజా(Ali Reza0, అరవింద్ కృష్ణ, ఊర్వశిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రే మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్ మాదిరాజు (Raj Madiraju) దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్ధాం...
ట్రెండింగ్ వార్తలు
సైంటిస్ట్ మర్డర్...
న్యూక్లియర్ ఎనర్జీ పై రీసెర్స్ చేసిన ఇస్రో సైంటిస్ట్ సుదర్శన్‌రెడ్డి ( ప్రతాప్ పోతన్ ) అనూహ్యంగా కన్నుమూయడం మిస్టరీగా మారుతుంది. అతడి హత్యా? ఆత్మహత్యా? అన్నది పోలీసులకు సవాల్‌గా మారుతుంది? మరోవైపు అతడి రీసెర్చ్ దేశం దాటి బయటకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపడతారు. ఈ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను నాయక్ (అలీ రెజా) చేపడతాడు.
మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌లోనే సుదర్శన్‌రెడ్డి భార్య అరుషి రెడ్డి అలియాస్ శర్మ (ఊర్వశి రాయ్)తో నాయక్‌కు అనుబంధం బలపడుతుంది. సుదర్శన్‌రెడ్డి మర్డర్‌తో సైకాలజిస్ట్ రఘు (అరవింద్ కృష్ణ)కు సంబంధం ఉందని నాయక్ అనుమానపడతాడు? అతడి అనుమానం నిజమేనా?
సుదర్శన్‌రెడ్డిని చంపింది ఎవరు? ప్రేమ పేరుతో సుదర్శన్‌రెడ్డికి ఆరుషి రెడ్డి ఎందుకు దగ్గరైంది? నాయక్ నిజంగా ఇన్వేస్టిగేషన్ ఆఫీసరేనా? ఈ ముగ్గురు సుదర్శన్‌రెడ్డికి దగ్గర కావడానికి కారణం ఏమిటి? అన్నదే గ్రే(Grey Telugu Movie Review) మూవీ కథ.
grey movie analysis - స్పై థ్రిల్లర్...
స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజ్ మాదిరాజు గ్రే సినిమాను తెరకెక్కించాడు. దేశరక్షణలో కీలకంగా నిలిచే సమాచారాన్ని సైంటిస్ట్‌ల నుంచి సేకరించడానికి ఐఎస్ఐ, సీఐఏ లాంటి ఏజెన్సీలు ఎలాంటి ఎత్తులువేస్తుంటాయి? హనీ ట్రాప్‌లలో సైంటిస్ట్‌లు ఎ విధంగా చిక్కుకుంటారు? అనే అంశాలతో దర్శకుడు రాజ్ మాదిరాజు ఈ కథను రాసుకున్నాడు.
సస్పెన్స్, థ్రిల్‌తో పాటు బోల్డ్‌నెస్ డోస్ పెంచుతూ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విక్రమ్ సారాభాయ్ తో పాటు ఎంతో మంది ఇండియన్ సైంటిస్ట్‌లు అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. నంబినారాయణన్ నేరంలో చిక్కుకున్నాడు. వారి వెనుక జరిగే కుట్రల నుంచి ఇన్‌స్పైర్ అవుతూ దర్శకుడు ఈ కథ రాసుకున్నట్లుగా ఆరంభంలో చెప్పారు.
చిక్కుముడులు హైలైట్...
సుదర్శన్ రెడ్డి మరణం, ఈ మర్డర్ కేసును నాయక్ ఇన్వేస్టిగేషన్ చేసే సీన్స్‌తోనే ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొదలవుతుంది. ఈ విచారణలో నాయక్, అరుషి మధ్య అనుబంధం బలపడటం, వారి రొమాన్స్‌తో చుట్టూ ఇంటర్వెల్ వరకు సినిమాను ఎంగేజింగ్‌గా నడిపించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో నాయక్, రఘుతో పాటు ఆరుషి అసలు రూపాన్ని రివీల్ చేస్తూ ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వెళ్లాడు డైరెక్టర్. అందరూ ఏజెంట్స్ అనే చెప్పే ట్విస్ట్ బాగుంది.
బడ్జెట్ పరిమితులు...
గ్రే మూవీ కాన్సెప్ట్ బాగున్నా బడ్జెట్ పరిమితుల కారణంగా ఓటీటీ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది. బోల్డ్‌సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. అవసరం లేకపోయినా చాలా చోట్ల లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది. కీలకమైన సన్నివేశాల్లో దర్శకుడు లాజిక్స్‌ను పక్కనపెట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నాడు. ఫస్టాఫ్ కథేమి లేకుండా సాగదీసిన దర్శకుడు సెకండాఫ్‌ను కాస్తంతా థ్రిల్లింగ్‌గా నడిపించాడు.
హీరోలు, విలన్స్ లేరు...
గ్రేలో ప్రత్యేకంగా హీరోలు, విలన్స్ ఎవరూ లేరు. ప్రతి క్యారెక్టర్‌కు సమానంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సైంటిస్ట్ పాత్రలో దివంగత నటుడు ప్రతాప్ పోతన్ యాక్టింగ్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయి. ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్‌గా అలీరెజా, సైకాలజిస్ట్ రఘుగా అరవింద్ కృష్ణ తమ పాత్రకు తగ్గ నటనను కనబరిచారు.
గ్లామర్ పరంగా ఊర్వశి రాయ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. ఆమెపై తెరకెక్కించిన రొమాంటిక్ సీన్స్ యూత్‌ను మెప్పించే అవకాశం ఉంది. కాన్సెప్ట్‌ను ఎలివేట్ చేయడానికి కంప్లీట్‌గా సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించారు. ఈ కెమెరా టెక్నిక్ కొత్తగా అనిపిస్తుంది.
Grey Telugu Movie Review -గ్లామర్ కోరుకునేవారికి...
గ్రే పేరులో ఉన్న వైవిధ్యత సినిమాలో కనిపించలేదు. కథ కంటే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌తోనే దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీతో చూడటం కష్టమే. గ్లామర్ కోరుకునే ప్రేక్షకుల్ని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5