Dasara Teaser Release Date: దసరా టీజర్ వచ్చేది ఆ రోజే-dasara teaser release date announced by the makers
Telugu News  /  Entertainment  /  Dasara Teaser Release Date Announced By The Makers
ద‌స‌రా మూవీలో నాని
ద‌స‌రా మూవీలో నాని

Dasara Teaser Release Date: దసరా టీజర్ వచ్చేది ఆ రోజే

25 January 2023, 18:31 ISTHari Prasad S
25 January 2023, 18:31 IST

Dasara Teaser Release Date: దసరా టీజర్ రిలీజ్ డేట్ ను బుధవారం (జనవరి 25) అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ తేదీని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.

Dasara Teaser Release Date: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. ఎంతో ఆసక్తి రేపుతున్న దసరా మూవీ నుంచి తాజాగా బుధవారం (జనవరి 25) ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

జనవరి 30న దసరా టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీని తెరకెక్కిస్తున్న ఎస్‌ఎల్వీ సినిమాస్ ట్విటర్ అకౌంట్ ద్వారా టీజర్ రిలీజ్ విషయాన్ని తెలిపింది. జనవరి 30న మీ స్క్రీన్స్ పై అగ్గి పుట్టించడానికి దసరా టీజర్ వస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ టీజర్ రానున్నట్లు చెప్పింది.

ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఓ వ్యక్తి తన చుట్ట కాల్చుకొని అగ్గి పుల్ల కింద పారేస్తాడు. ఆ తర్వాత ఆ మంట కాస్తా పెద్దదిగా మారి.. టీజర్ ఆన్ జనవరి 30 అనే అక్షరాలుగా కనిపిస్తుంది. ఈ దసరా మూవీలో నాని సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు.. రూ.70 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తి అయిందని, హీరోహీరోయిన్లు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన నాని.. ఇప్పుడు లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం ఈ లుక్ మార్చినట్టుగా ఉన్నాడు.

సంబంధిత కథనం

టాపిక్