Producer iPhone Gift to Crew: ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన నాని నిర్మాత.. బహుమతిగా ఏకంగా 28 ఖరీదైన ఫోన్లు -dasara movie producer 28 iphone 14 mobile phones gifted to his crew
Telugu News  /  Entertainment  /  Dasara Movie Producer 28 Iphone 14 Mobile Phones Gifted To His Crew
సిబ్బందికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
సిబ్బందికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Producer iPhone Gift to Crew: ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన నాని నిర్మాత.. బహుమతిగా ఏకంగా 28 ఖరీదైన ఫోన్లు

23 November 2022, 22:06 ISTMaragani Govardhan
23 November 2022, 22:06 IST

Producer iphone Gift to Crew: దసరా చిత్ర నిర్మాత సుధాకర్ చెరూకురి తన సిబ్బందికి ఖరీదైన బహుమానాలు ఇచ్చారు. ఏకంగా 28 ఐఫోన్లను తన సిబ్బందికి ఇచ్చారు. దసరా కంటెంట్‌పై సంతృప్తి చెందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Producer iPhone Gift to Crew: సినిమాను నిర్మించే నిర్మాతలు దర్శకులు, హీరోలకు రెమ్యూనరేషన్ కాకుండా.. అప్పుడప్పుడు గిఫ్టులు ఇవ్వడం సాధారణంగా చిత్రసీమలో జరుగుతూనే ఉంటుంది. అది ఈ ఒరవడి బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్‌లోనూ అలవాటైంది. తాజాగా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన సిబ్బందికి, స్టాఫ్‌కు ఖరీదైన బహుమానాలు ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో వార్త హల్చల్ చేస్తోంది. ఆయన నేచురల్ స్టార్ నానితో నిర్మిస్తున్న దసరా చిత్రబృందానికి ఖరీదైన ఐఫోన్లు ఇచ్చినట్లు సమాచారం.

దసరా చిత్రం తెరకెక్కిన విధానం పట్ల, కంటెంట్ పరంగా సంతృప్తి చెందిన సుధాకర్ చెరుకూరి.. సదరు టీమ్‌ ప్రయత్నం, కృషికి ఫలితంగా ఖరీదైన గిఫ్టులు ఇద్దామని నిర్ణయించుకున్నారు. అందుకోసం సిబ్బందికి 28 సరికొత్త ఐఫోన్ 14 బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్లను బహుమతిగా ఇచ్చారట. సాధారణంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి బహుమతుల పంపిణీ ఉంటుంది. కానీ ఎప్పుడో అరుదుగా మాత్రమే ఇలా సినిమా విడుదల కాకముందే సిబ్బందిని గిఫ్టులతో ఆశ్చర్యానికి లోను చేయడం జరుగుతుంది.

ఇలాంటి ఒరవడులు కూడా సినిమా విజయంపై నిర్మాతల నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ పాట విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అంతేకాకుండా ఎక్కువగా ఈ సినిమా అంతా దుమ్ము, ధూలి ఎక్కువగా ఉండే బొగ్గు గనుల వద్ద జరిగినట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్