Ahimsa Trailer: ధర్మం కోసం యుద్ధం చేసిన కృష్ణుడు - అహింస ట్రైలర్ రిలీజ్
Ahimsa Trailer: దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం అహింస. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.
Ahimsa Trailer: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతోన్నాడు. సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం అహింస. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మెగా హీరో రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. వీడి గురించి మీకు తెలియదు అంటూ పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేసే సీన్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. తనపై అక్రమంగా కేసు పెట్టిన వారిని ఎదురించలేని పిరికివాడిగా ట్రైలర్‌లో అభిరామ్ కనిపించారు. అలాగే బావ మరదళ్ల అందమైన ప్రేమకథను ట్రైలర్‌లో చూపించారు.
ఓ వైపు పోలీసులు, మరోవైపు విలన్స్ నాయకానాయికల్ని వెతకడం, వారి నుంచి తప్పించుకునే సీన్స్ ఇంట్రెస్ట్‌ను కలిగిస్తున్నాయి. ఎప్పుడు గాంధీగారే కరెక్ట్ కృష్ణుడు రాంగ్ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌కు లేదు కృష్ణుడే కరెక్ట్ నా కుటుంబాన్ని, నా పరివారాన్ని నన్ను నమ్ముకున్న వాళ్లను కాపాడటమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే అంటూ అభిరామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. శాంత స్వభావుడైన ఓ యువకుడు తన ప్రేమ కోసం హింస బాటను ఎలా పట్టాడన్నది దర్శకుడు తేజ అహింస సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో లాయర్ పాత్రలో సదా నటిస్తోంది. గీతిక హీరోయిన్‌గా నటిస్తోంది. రజత్ బేడీ, రవికాలే, కమల్ కామరాజు కీలకక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే థియేటర్లలో ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆర్‌పీ పట్నాయక్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.