Waltair VeerayyaFirst Single: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ - మాస్ లుక్‌లో చిరు-chiranjeevi waltair veerayya first single release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya First Single Release Date Announced

Waltair VeerayyaFirst Single: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ - మాస్ లుక్‌లో చిరు

Nelki Naresh Kumar HT Telugu
Nov 20, 2022 05:00 PM IST

Waltair VeerayyaFirst Single: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ఆదివారం అనౌన్స్ చేశారు. ఈ పాట ఎప్పుడూ రిలీజ్ కానుందంటే...

చిరంజీవి
చిరంజీవి

Waltair VeerayyaFirst Single: వాల్తేర్ వీర‌య్య సినిమాతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రెండు నెల‌ల ముందుగానే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది చిత్ర యూనిట్‌. ఆదివారం ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. బాస్ పార్టీ అనే ప‌ల్ల‌వితో సాగే ఈ పాట‌ను న‌వంబ‌ర్ 23న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

చిరంజీవి మాస్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో లుంగీ ధ‌రించి పూల‌చొక్కాలో చిరంజీవి క‌నిపిస్తున్నారు. బాస్ పార్టీలో సాంగ్‌లో చిరంజీవితో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా స్టెప్పులేసింది. ఈ బాస్ పార్టీ పాట‌కు చిరంజీవి డ్యాన్స్‌ల‌తో పాటు ఊర్వశి రౌటేలా గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. జాల‌ర్ల బ్యాక్‌డ్రాప్‌లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వాల్తేర్ వీర‌య్య సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు కె.ఎస్ ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తోన్నారు. చిరంజీవికి జోడిగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. పాట‌ల చిత్రీక‌ర‌ణ ఒక్క‌టే బ్యాలెన్స్‌గా మిగిలిన‌ట్లు చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌తోపాటు బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇద్ద‌రు అగ్ర హీరోలు సంక్రాంతికి పోటీప‌డ‌టం టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

IPL_Entry_Point