Waltair Veerayya Team New Year Party: వాల్తేర్ వీర‌య్య టీమ్‌కు న్యూ ఇయ‌ర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్‌-chiranjeevi hosts special new year party for waltair veerayya team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Hosts Special New Year Party For Waltair Veerayya Team

Waltair Veerayya Team New Year Party: వాల్తేర్ వీర‌య్య టీమ్‌కు న్యూ ఇయ‌ర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 02, 2023 08:21 PM IST

Waltair Veerayya Team New Year Party: కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకొని వాల్తేర్ వీర‌య్య టీమ్‌కు చిరంజీవి స్పెష‌ల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వాల్తేర్ వీరయ్య టీమ్‌తో చిరంజీవి
వాల్తేర్ వీరయ్య టీమ్‌తో చిరంజీవి

Waltair Veerayya Team New Year Party: న్యూ ఇయ‌ర్‌ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశాడు మెగాస్టార్‌ చిరంజీవి. వాల్తేర్ వీర‌య్య టీమ్‌కు స్పెషల్ పార్టీ ఇచ్చాడు. చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టిస్తోన్నాడు.

కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకొని ఈ సినిమా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రికీ చిరంజీవి స్పెష‌ల్ పార్టీ ఇచ్చారు. పార్టీలో వాల్తేర్ వీర‌య్య టీమ్‌తో క‌లిసి దిగిన ఫొటోను చిరంజీవి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పార్టీకి ర‌వితేజ‌తో పాటు ద‌ర్శ‌కుడు బాబీ, రైట‌ర్ కోన వెంక‌ట్‌, ప్రొడ్యూస‌ర్ ర‌విశంక‌ర్‌, ఫైట్ మాస్ట‌ర్స్ రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పాటు వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస‌రెడ్డితో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు హాజ‌ర‌య్యారు.

చిరంజీవి షేర్ చేసిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వైజాగ్ జాల‌రీ పేట్ బ్యాక్‌డ్రాప్‌లో వాల్తేర్ వీర‌య్య సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ర‌వితేజ క్యారెక్ట‌ర్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తోన్న‌ట్లు చెబుతున్నారు. వాల్తేర్ వీర‌య్య‌లో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోండ‌గా ర‌వితేజ‌కు జోడీగా కేథ‌రిన్ క‌నిపించ‌బోతున్న‌ది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను సోమ‌వారం పూర్తిచేశారు. యూ.ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.

ఇటీవ‌లే చిరంజీవి, ర‌వితేజ క‌లిసి డ్యాన్స్ చేసిన పూన‌కాలు లోడింగ్ అనే పాట‌ను రిలీజ్ చేశారు. వాల్తేర్ వీర‌య్య‌తో పాటు భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తోన్నాడు చిరంజీవి. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

IPL_Entry_Point