Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం-bollywood filmmaker rohit shetty injured shooting in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Filmmaker Rohit Shetty Injured Shooting In Hyderabad

Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం

Maragani Govardhan HT Telugu
Jan 07, 2023 02:59 PM IST

Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టి గాయాలపాలయ్యారు. ఆయన హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ప్రమాదానికి గురికావడంతో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించారు.

రోహిత్ శెట్టి
రోహిత్ శెట్టి

Rohit Shetty Injured: బాలీవుడ్ డైరెక్టర్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టికి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రోహిత్ శెట్టి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి తరహా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్‌ను చిత్రబృందం రూపొందించారు. ఈ ప్రత్యేకమైన సెట్ కోసమే మేకర్స్ 20 కోట్ల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ సెట్‌లోనే రోహిత్ శెట్టి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్, శిల్పా శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హై యాక్షన్ స్టంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కార్ ఛేజ్ యాక్షన్ సీక్వెన్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లకు ఇందులో కొదవే లేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్