Bigg Boss 6 Telugu: అందంగా ముస్తాబైన బిగ్‌బాస్.. మరి ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేయండి..!-bigg boss season 6 telugu first glimpse out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu: అందంగా ముస్తాబైన బిగ్‌బాస్.. మరి ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

Bigg Boss 6 Telugu: అందంగా ముస్తాబైన బిగ్‌బాస్.. మరి ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

Maragani Govardhan HT Telugu
Sep 01, 2022 04:39 PM IST

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబరు 4 నుంచి ప్రారంభం కాబోతుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ వీడియోను గమనిస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను అందంగా ముస్తాబు చేసినట్లు కనిపిస్తోంది.

బిగ్‌బాస్ సీజన్ 6
బిగ్‌బాస్ సీజన్ 6 (Twitter )

Bigg Boss 6 Telugu First Glimpse: బుల్లి తెర పాపులర్ షో బిగ్‌బాస్ ఆరో సీజన్‌ ప్రారంభాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో ఈ రియాల్టీ షో ఆరంభం కానుంది. ఆదివారం అంటే సెప్టెంబరు 4 నుంచి బుల్లితెరపై ఘనంగా ఈ షో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ షోకు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత వినూత్నంగా, వైవిధ్యంగా షోనూ నిర్వహించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ షోకు సంబంధించి లోగో, గ్లింప్ల్, ప్రచార వీడియోలను విడుదల చేశారు మేనేజ్మెంట్. తాజాగా బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉందో తెలిసేలా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అందంగా ముస్తాబైన బిగ్‌బాస్ ఇల్లును గమనించవచ్చు.

రంగరంగుల దీపాల వెలుగులో కళ్లు జిగేల్ మనేలా అద్వితీయంగా ఉంది బిగ్‌బాస్ హౌస్. గత సీజన్లుగా భిన్నంగా, మరింత అందంగా ముస్తాబుజేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో ఈ ఇంటిని చూపించారు. అంతేకాకుండా షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంట్రీని, వారి ఫెర్మార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ను కూడా చూపించారు. ఈ ఆదివారం నాడు బిగ్‌బాస్ షో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న ఈ ఆరో సీజన్‌ను మరింత ఆసక్తికరంగా నిర్వహించేందుకు గానూ.. 19 మంది కంటెస్టెంట్లను లోపలకు పంపుతున్నట్లు సమాచారం. ఇక వారి మధ్య నడిచే సంఘర్షణలు, గొడవలు, లవ్ ట్రాక్‌లు, వినోదాలు, విందులు వేటికీ ఢోకా లేకుండా పక్కాగా ఉండేలా బిగ్‌బాస్ మేనేజ్మెంట్.

బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, గాయకులు, యూట్యూబ్ సెలబ్రెటీలతో పాటు ఓ సామాన్యుడు కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. చలాకీ చంటి, యాంకర్ ఆరోహి, రీతూ చౌదరీ, గలాట గీతూ, సింగర్ రేవంత్, హేమచంద్ర, శ్రావణ భార్గవి తదితరులు ఈ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం