Telugu News  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Winner Runner Up Prediction And Guest List
రేవంత్
రేవంత్

Bigg Boss 6 Telugu Grand Finale:బిగ్‌బాస్ సీజ‌న్ 6 విజేత అత‌డేనా - ఫైన‌ల్‌కు గెస్ట్‌గా ర‌వితేజ?

18 December 2022, 11:29 ISTNelki Naresh Kumar
18 December 2022, 11:29 IST

Bigg Boss 6 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 గ్రాండ్ ఫినాలే ఆదివారం జ‌రుగ‌నుంది. బిగ్‌బాస్ ట్రోఫీని రేవంత్ గెలుచుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Bigg Boss 6 Telugu Grand Finale: బిగ్‌బాస్ 6 తెలుగు తుది ద‌శ‌కు చేరుకున్న‌ది. ఆదివారం (నేడు) గ్రాండ్ ఫినాలే జ‌రుగ‌నుంది. ఫైన‌ల్‌కు రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రోహిత్‌తో పాటు కీర్తి చేరుకున్నారు. బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది నేడు తేల‌నుంది. ఫైన‌ల్ ఎపిసోడ్‌కు ముందుగానే విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది డిసైడ్ అయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సీజ‌న్ విజేత‌గా రేవంత్ నిలిచిన‌ట్లు సోష‌ల్ మీడియాలో అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. రేవంత్ ట్రోపీ గెలిచిన‌ట్లు చేసిన ట్వీట్స్ వైర‌ల్‌గా మారాయి. శ్రీహాన్ సెకండ్ ప్లేస్‌లో , ఆదిరెడ్డి థ‌ర్డ్ ప్లేస్‌లో నిలిచిన‌ట్లు చెబుతున్నారు. ఫైన‌ల్ ఎపిసోడ్‌లో అత్య‌ధికంగా ఓట్లు రేవంత్‌కు ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

గెస్ట్‌గా ర‌వితేజ‌...

గ్రాండ్ ఫినాలేకు ర‌వితేజ గెస్ట్‌గా హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో పాటు ధ‌మాకా టీమ్ బిగ్‌బాస్‌లో సంద‌డి చేయ‌బోఉన్న‌ట్లు తెలిసింది. విన్న‌ర్‌కు ర‌వితేజ ట్రోఫీ అందించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. 18 పేజెస్ టీమ్ కూడా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు హాజ‌రుకానున్న‌ట్లు చెబుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫినాలే ఎపిసోడ్‌కు హాజ‌రుకానున్న‌ట్లు తెలిసింది.

మాజీ కంటెస్టెంట్స్ సంద‌డి...

శ‌నివారం బిగ్‌బాస్ హౌజ్‌లో మాజీ కంటెస్టెంట్స్ సంద‌డి చేశారు. రోల్ రైడా, అవినాష్‌, అరియానా, కాజ‌ల్‌, ఆర్జే చైతూ,అఖిల్, తేజ‌స్విని మ‌దివాడ హౌజ్‌లో అడుగుపెట్టారు. కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడించారు. కామెడీ టాస్క్‌ల‌తో పాటు డ్యాన్సులు చేసి ఆల‌రించారు.