Bhootaddam Bhaskar Narayana Teaser: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ - టీజ‌ర్ రిలీజ్‌-bhootaddam bhaskar narayana teaser unveiled by teja sajja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bhootaddam Bhaskar Narayana Teaser Unveiled By Teja Sajja

Bhootaddam Bhaskar Narayana Teaser: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ - టీజ‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2023 08:36 PM IST

Bhootaddam Bhaskar Narayana Teaser: శివ కందుకూరి భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ మూవీ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శివ కందుకూరి,రాశిసింగ్
శివ కందుకూరి,రాశిసింగ్

Bhootaddam Bhaskar Narayana Teaser: శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ హీరో తేజ స‌జ్జా శ‌నివారం రిలీజ్ చేశాడు.

చ‌నిపోయిన 16 మంది త‌ల‌లు ఎక్క‌డున్నాయి...ఏమ‌య్యాయి అన్న‌ది ఎవ‌రికి తెలియ‌దు అనే డైలాగ్‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. స్టేట్ మొత్తం నీ గురించి మాట్లాడుకోవాలంటే ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేస్ సాల్వ్ చేయాలి అంటూ ఓ యువ‌కుడు డైలాగ్ చెప్ప‌గానే భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ‌గా హీరో శివ కందుకూరి స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తూ క‌నిపించాడు.

తొమ్మిదో రోజు తొమ్మిదో నెల తొమ్మిది గంట‌ల‌కు అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ను ఇంకో మ‌ర్డ‌ర్ జ‌రిగింది అంటూ మ‌రొక‌రు పూర్తిచేయ‌డం టీజ‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. దేవుడి గ‌దిలో దిష్టి బొమ్మ క‌నిపించే సీన్‌తో టీజ‌ర్ ముగిసింది.

టీజ‌ర్ చూస్తుంటే పోలీసుల‌కు చాలా ఏళ్లుగా దొర‌క్కుండా త‌ప్పించుకు తిరుగుతోన్న ఓ సైకో కిల్ల‌ర్‌, అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే ఓ డిటెక్టివ్ క‌థ‌తో భూత‌ద్ధం బాస్క‌ర్ నారాయ‌ణ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. మార్చి 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇందులో శివ‌కందుకూరికి జోడీగా రాశిసింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు రాని స‌రికొత్త క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించామ‌ని టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి పేర్కొన్నాడు.

IPL_Entry_Point

టాపిక్