Telugu News  /  Entertainment  /  Balakrishna Confirms Mokshagna Entry Into Tollywood
బాలకృష్ణ, మోక్షజ్ఞ
బాలకృష్ణ, మోక్షజ్ఞ

Balakrishna on Mokshagna entry: వచ్చే ఏడాదే సినిమాల్లోకి మోక్షజ్ఞ.. కన్ఫామ్‌ చేసిన బాలయ్య

28 November 2022, 16:39 ISTHT Telugu Desk
28 November 2022, 16:39 IST

Balakrishna on Mokshagna entry: వచ్చే ఏడాదే సినిమాల్లోకి మోక్షజ్ఞ రానున్నాడు. ఈ విషయాన్ని బాలకృష్ణే ఖరారు చేశాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో పాల్గొన్న బాలయ్య ఈ విషయాన్ని చెప్పాడు.

Balakrishna on Mokshagna entry: టాలీవుడ్‌లోకి నందమూరి వంశం నుంచి మరో నట వారసుడు వస్తున్నాడు. ఈసారి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనున్నాడు. నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్తను బాలయ్య చెప్పేశాడు. తన తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది (2023) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో పాల్గొన్న బాలకృష్ణ.. ఈ గుడ్‌న్యూస్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. మోక్షజ్ఞను కూడా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను లాంచ్‌ చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని బాలకృష్ణను అడగగా.. అంతా దైవేచ్ఛ అని చెప్పడం విశేషం.

బోయపాటి శ్రీను ఇప్పటికే నందమూరి హీరోలతో నాలుగు సినిమాలు చేశాడు. అందులో మూడు బాలకృష్ణతో కాగా.. ఒకటి జూనియర్‌ ఎన్టీఆర్‌తో కావడం విశేషం. ఇక ఇప్పుడు మరో నందమూరి వారసుడిని కూడా టాలీవుడ్‌కి పరిచయం చేసే బాధ్యతలు బోయపాటే తీసుకున్నాడు.

మరోవైపు ఇదే ఈవెంట్‌లో అఖండ సీక్వెల్‌ను కూడా బాలకృష్ణ ఖరారు చేశాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ అఖండ విజయాన్నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అఖండ 2 సబ్జెక్ట్‌ రెడీగా ఉందని కూడా బాలకృష్ణ చెప్పాడు. సరైన సమయంలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తామనీ తెలిపాడు.

ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో వీర సింహా రెడ్డి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇందులో మరోసారి బాలయ్య ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన జై బాలయ్య సాంగ్‌ దుమ్ము రేపింది. ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు కావడంతో నందమూరి ఫ్యాన్స్‌ హడావిడి మొదలైంది. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్‌ లాంచ్‌ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అతన్ని బోయపాటే లాంచ్‌ చేస్తాడా లేక మరే ఇతర డైరెక్టర్‌ అయినా పరిచయం చేస్తాడా అన్నది చూడాలి.

టాపిక్