NBK 108 Heroine: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కాసుల వర్షం కురవడంతో ఆయన తదుపరి చిత్రంపై విపరీతంగా బజ్ నెలకొంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారు మన బాలయ్య. ఇందులో హీరోయిన్‌గా తొలుత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత హుమా ఖురేషి, త్రిష లాంటి పేర్లు వినిపించాయి. ఇంతలోనే ఈ లిస్టులో ఎస్ఆర్ కల్యాణమండపం హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పేరు కూడా వినిపించింది. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్టులో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.,ఇంతకీ బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఇటీవల వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన హనీ రోజ్ పేరు వినిపిస్తోంది. మరోపక్క అనిల్ రావిపూడి కాజల్ అగర్వాల్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కాజల్ సీనియర్ హీరోయిన్ల సరసన ఓకే చెబుతున్న కారణంగా ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ బాలయ్య మాత్రం హనీరోజ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనలైజ్ చేస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.,షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిల్ రావిపూడి తాలుకూ కామెండీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బాలయ్య స్టార్‍డమ్‌ను దృష్టిలో ఉంచుకుని అనిల్ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు.,ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లపరంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.,