Balagam Box Office Collections: లాభాల్లోకి బలగం.. నాలుగు రోజుల కలెక్షన్లు ఇవీ-balagam box office collections are good as the movie into profits ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balagam Box Office Collections Are Good As The Movie Into Profits

Balagam Box Office Collections: లాభాల్లోకి బలగం.. నాలుగు రోజుల కలెక్షన్లు ఇవీ

Hari Prasad S HT Telugu
Mar 07, 2023 06:46 PM IST

Balagam Box Office Collections: లాభాల్లోకి దూసుకెళ్లింది బలగం మూవీ. నాలుగు రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్లు ఈ మూవీ హిట్ అని తేల్చాయి.

బలగం మూవీ
బలగం మూవీ

Balagam Box Office Collections: పక్కా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన మూవీ బలగం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డిలాంటి వాళ్లు నటించిన ఈ మూవీ ఇప్పుడు లాభాల్లోకి దూసుకెళ్లింది. గత శుక్రవారం (మార్చి 3) రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ కొట్టేసింది.

దిల్ రాజు సమర్పించిన ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.3.75 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇవి గ్రాస్ కలెక్షన్లు కాగా.. షేర్ రూ.1.58 కోట్లుగా ఉంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు రూ.1.15 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ రూ.1.3 కోట్లు కాగా.. ఇప్పటికే 0.26 కోట్ల లాభాలు ఆర్జించింది.

లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బలగం మూవీని ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లో ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ. 3.68 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు, మూడో రోజు రూ.1.75 కోట్లు, నాలుగు రోజు రూ.58 లక్షలు వచ్చాయి.

తమ బలగం మూవీ కలెక్షన్లు చూసి ప్రజెంటర్ దిల్ రాజు హర్షం వ్యక్తం చేశాడు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతుండటంపై అతడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రానున్న రోజుల్లో ఏపీలోనూ ఈ సినిమా మరిన్ని స్క్రీన్లలో రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

బలగం గురించి..

కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య ఉండే అపోహ‌లు, అపార్థాలు, వాటిని హీరో ప‌రిష్క‌రించే క‌థ‌ల‌తో గ‌తంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. బ‌ల‌గం కోర్ పాయింట్ అదే అయినా చావు చుట్టూ ఈ క‌థ‌ను న‌డిపించి తొలి సినిమాతోనే వైవిధ్య‌త‌ను చాటుకున్నాడు ద‌ర్శ‌కుడు వేణు టిల్లు. ఈ సెన్సిటివ్ పాయింట్ నుంచి కామెడీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని ర‌కాల ఎమోష‌న్స్ చ‌క్క‌గా రాబ‌ట్టుకున్నాడు.

ఈ ఎమోష‌న్స్‌కు స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ సంస్కృతుల్ని, సంప్ర‌దాయాల్ని జోడించి స‌హ‌జంగా బ‌ల‌గం సినిమాను తెర‌కెక్కించాడు. చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డి ఆప్తుల‌కు దూరం కావ‌డం స‌రికాద‌ని, క‌లిసి ఉండ‌టంలోనే సంతోషం ఇమిడి ఉంటుంద‌ని చాటిచెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం