Allu Arjun for Alluri: అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. శ్రీవిష్ణు కోసం స్టైలిష్ స్టార్-allu arjun coming as chief guest sree vishnu alluri movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun For Alluri: అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. శ్రీవిష్ణు కోసం స్టైలిష్ స్టార్

Allu Arjun for Alluri: అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. శ్రీవిష్ణు కోసం స్టైలిష్ స్టార్

Maragani Govardhan HT Telugu
Sep 16, 2022 03:00 PM IST

Alluri Pre Release Event: శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.

అల్లూరిలో శ్రీ విష్ణు
అల్లూరిలో శ్రీ విష్ణు (Twitter)

Allu Arjun as Chief guest for Alluri Pre Release event: విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగులో వరుస చిత్రాలతో దూసుకెళ్తోన్న హీరో శ్రీ విష్ణు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర లాంటి సూపర్ హిట్లు అందుకున్న ఈ హీరో.. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అదే ఆయన నటిస్తున్న అల్లూరి చిత్రం. ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా చేయాలని సన్నాహాలు ప్రారంభించింది.

ఈ ఆదివారం నాడు శ్రీ విష్ణు నటించిన అల్లూరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. దీంతో సినిమాపై బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది. పోలీసు అధికారి పాత్రలో శ్రీ విష్ణు పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ పాత్రను పోషించడానికి తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.

ఇదిలా ఉంటే నాని ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయబోతున్నారు. ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో శ్రీ విష్ణు కనిపించాడు. ఎప్పుడూ పక్కింటి కుర్రాడి పాత్రలో మెప్పించిన ఈ హీరో.. అల్లూరిలో పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రలో యాక్షన్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథగా చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కమ్ వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. కయాడు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేయగా.. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం