OTT Releases This Week:,18 పేజెస్ (18 Pages) - జనవరి 27 - ఆహా, నెట్ఫ్లిక్స్నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీలో (Aha Ott) జనవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఓ అమ్మాయిని నేరుగా కలవకుండా డైరీ ద్వారా ఆమెతో ప్రేమలో పడిన ఓ యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈసినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.,త్రిష (Trisha) రాంగి - జనవరి 29 - నెట్ఫ్లిక్స్త్రిష హీరోయిన్‌గా నటించిన రాంగి సినిమా జనవరి 29న నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజ్ కానుంది. టెర్రరిస్ట్‌గా ముద్రపడిన ఓ ఛానల్ రిపోర్టర్ తనపై పడిన ఆపవాదును తొలగించుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఈ సినిమా కథ. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు శరవణన్ దర్శకత్వం వహించాడు.,ఎన్ యాక్షన్ హీరో - జనవరి 27 - నెట్ఫ్లిక్స్బాలీవుడ్ చిత్రం ఎన్ యాక్షన్ హీరో నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 27న విడుదలకానుంది. ఆయుష్మాన్‌ఖురానా, జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ అయ్యర్ దర్శకుడు. డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను దక్కించుకున్నది.,డియర్ ఇష్క్ (హిందీ వెబ్‌సిరీస్) - జనవరి 26 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,సాటర్డే నైట్ (మలయాళం మూవీ) - జనవరి 27 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,జాన్‌బాజ్ హిందుస్థాన్ కే - జనవరి 26- జీ5రెజీనా(Regina Cassandra) ప్రధాన పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ వెబ్‌సిరీస్ జాన్‌బాజ్ హిందుస్థాన్ కే జనవరి 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీజీత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.,అయాలీ - జనవరి26 - జీ5,యూ పీపుల్ - జనవరి 27 - నెట్‌ఫ్లిక్స్,షాట్ గన్ వెడ్డింగ్ - జనవరి 27 - అమెజాన్ ప్రైమ్,లాక్‌వుడ్ అండ్ కో - జనవరి 27 - నెట్‌ఫ్లిక్స్,ది ఇన్విటేషన్ - జనవరి 28 - నెట్‌ఫ్లిక్స్,ది ష్రింకింగ్ - జనవరి 27 - ఆపిల్ టీవీ