Palvai Sravanthi : మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్ - పాల్వాయి స్రవంతి రాజీనామా
Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు.
పాల్వాయి స్రవంతి రాజీనామా
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ అధినాయకత్వాలకు షాక్ ఇస్తున్నారు. టికెట్లు దక్కపోవటంతో పాటు అంతర్గత కలహాలతో ఎన్నికల వేళ రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కీలక నేత పాల్వాయి స్రవంతి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు స్రవంతి. అయితే తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ లోకి రావటంతో ఆయనకే మునుగోడు టికెట్ ఇచ్చారు. దీనికి తోడు పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో స్రవంతి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా స్రవంతి గులాబీ కండువా కప్పుకోనున్నారు.