Tata Motors price hike : మళ్లీ పెరగనున్న టాటా మోటార్స్​ కార్ల ధరలు!-tata motors mulling price hike for passenger vehicles from next month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Price Hike : మళ్లీ పెరగనున్న టాటా మోటార్స్​ కార్ల ధరలు!

Tata Motors price hike : మళ్లీ పెరగనున్న టాటా మోటార్స్​ కార్ల ధరలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 06, 2022 07:20 AM IST

Tata Motors price hike : టాటా మోటార్స్​ సంస్థ.. తన వాహనాల ధరలను మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇది 2023 జనవరి నుంచి అమల్లోకి రానున్నట్టు సమాచారం.

మళ్లీ పెరగనున్న టాటా మోటార్స్​ కార్ల ధరలు!
మళ్లీ పెరగనున్న టాటా మోటార్స్​ కార్ల ధరలు!

Tata Motors price hike : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​.. వాహనాల ధరలను మరోమారు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 జనవరిలో వాహనాల ధరలను పెంచాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈసారి కొత్త కారణం…!

2023 ఏప్రిల్​ నుంచి ఎమిషన్స్​కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటికి తగ్గట్టుగా.. సంస్థకు చెందిన వాహనాలను సిద్ధం చేసేందుకు ఈసారి ధరలను పెంచాలని టాటా మోటార్స్​ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏడాది కాలంగా ముడి సరకు ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాజా ధరల పెంపుతో కంపెనీపై భారం తగ్గుతుందని టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్​, ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఎండీ శైలేష్​ చంద్ర తెలిపారు.

"రెగ్యూలేటరీ మార్పులు.. ధరలను ప్రభావితం చేస్తాయి. ముడి సరకు ధరలు తగ్గితే, అది వచ్చే త్రైమాసికంలో కనిపిస్తాయి. కానీ ఏడాదిగా ముడి సరకు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫలితంగా కంపెనీపై భారం పడింది. అందుకే ధరలను పెంచాలని భావిస్తున్నాము," అని శైలేష్​ చంద్ర వెల్లడించారు.

Tata Motors price hike latest news : బ్యాటరీల ధరలు కూడా పెరిగాయని, ఈ వ్యవహారం ఈవీలను కూడా ప్రభావితం చేశాయని శైలేష్​ చంద్ర స్పష్టం చేశారు.

పంచ్​, నెక్సాన్​, హ్యారియర్​, సఫారీతో పాటు నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ వంటి మోడల్స్​ను విక్రయిస్తోంది టాటా మోటార్స్​.

వాస్తవానికి.. ఈ ఏడాది చాలా సార్లు వాహనాల ధరలను పెంచింది టాటా మోటార్స్​. గత నెల కూడా వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అది నవంబర్​ 7 నుంచి అమల్లోకి వచ్చింది. మళ్లీ వచ్చే నెలలో ధరలను పెంచుతామని చెబుతుండటం కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాటా మోటర్స్​కు చాలా కార్లు పెండింగ్​లో ఉండిపోయాయి. అవి ఎప్పుడు డెలివరీ అవుతాయో అని ఎదురుచూస్తున్న కస్టమర్లకు.. ధరలు పెంపు వార్తలు భయపెడుతున్నాయి.

Tata Motors : టాటా మోటార్స్​ ఒక్కటే కాదు.. మారుతీ సుజుకీ నుంచి మహీంద్రా అండ్​ మహీంద్రా వరకు.. అన్ని ఆటో సంస్థలు తమ వాహనాల ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. 2023 జనవరిలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు గత వారమే మారుతీ సుజుకీ ప్రకటించింది.

ఎమిషన్​ నిబంధనల్లో మార్పులు..

2023 ఏప్రిల్​ నుంచి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం.. ఎమిషన్​ లెవల్స్​ను డ్రైవింగ్​ సమయంలోనే పర్యవేక్షించేందుకు.. కారులో సెల్ఫ్​ డయగ్నోస్టిక్​ డివైజ్​ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎమిషన్​ అనేది ఎక్కువగా ఉంటే.. వార్నింగ్​ సిగ్నల్స్​ ఇస్తుంది. ఆ వెంటనే కారు సర్వీసుకు ఇవ్వాల్సి ఉంటుంది.

అంతేకాకుండా.. ఫ్యూయెల్​ ఇంజెక్టర్లను కూడా కారులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పూర్తి చేయాలంటే.. ఇప్పుడున్న సెమీకండక్టర్లు సరిపోవు. వాటిని కూడా అప్​గ్రేడ్​ చేయాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం