Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు డౌన్​-stock market news today sensex and nifty opens on negative note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today Sensex And Nifty Opens On Negative Note

Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు డౌన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 111 పాయింట్ల నష్టంతో 60,094 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 52 పాయింట్లు కోల్పోయి 17,839 వద్ద ట్రేడ్​ అవుతోంది.

రిపబ్లిక్​ డే కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం సెలవు తీసుకున్నాయి. అయితే.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో మాత్రం సూచీలు భారీగా పడ్డాయి. 226 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 60,205 వద్ద ముగిసింది. ఇక 226 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద స్థిరపడింది నిఫ్టీ. బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 1,085 పాయింట్లు కోల్పోయి 41,647 వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్,​ నిఫ్టీలు వరుసగా 60,166- 17,877 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 17,849- 17,789 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,043- 18,103 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

హీరో మోటోకార్ప్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2725, టార్గెట్​ రూ. 2850- రూ. 2900

Bharti Airtel share price target : భారతీ ఎయిర్​టెల్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 760, టార్గెట్​ రూ. 790- రూ. 800

Tata Steel share price target : టాటా స్టీల్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 130

ఓఎన్​జీసీ​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 147, టార్గెట్​ రూ. 163

లాభాలు.. నష్టాలు..

టాటా మోటార్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్​టెక్​, విప్రో, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment : అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.61శాతం​, ఎస్​ అండ్​ పీ 500 1.1శాతం, నాస్​డాక్​ 1.76శాతం లాభాల్లో ముగిశాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.11శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.23శాతం మేర లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

త్రైమాసిక ఫలితాలు..

Q3 results : బజాజ్​ ఫినాన్స్​, వేదాంత, ఆర్తి డ్రగ్స్​, ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ ఏఎంసీ, సీఎంఎస్​ ఇన్​ఫో సిస్టెమ్​, గ్లెన్​మమార్క్​ లైఫ్​ సైన్సెస్​తో పాటు ఇతర సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఎన్​టీపీసీ, భారత్​ ఎలక్ట్రానిక్స్​, కేర్​ రేటింగ్స్​, డీసీబీ బ్యాంక్​, గుజరాత్​ అంబుజా ఎక్స్​పోర్ట్స్​తో పాటు ఇతర సంస్థల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లలో ఎఫ్​ఐఐలు రూ. 2393.94కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1378.49కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం