Stock market news today : నూతన ఏడాదిని స్వల్ప లాభాలతో ప్రారంభించిన స్టాక్​ మార్కెట్లు-stock market news today 2 january 2023 sensex and nifty opens flat ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 2 January 2023 Sensex And Nifty Opens Flat

Stock market news today : నూతన ఏడాదిని స్వల్ప లాభాలతో ప్రారంభించిన స్టాక్​ మార్కెట్లు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​..  70పాయింట్లు పెరిగి 60,911 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 35 పాయింట్ల లాభంతో 18,140 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం (డిసెంబర్ 30) ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. నిఫ్టీ50.. 85 పాయింట్ల నష్టంతో 18,105 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 293 పాయింట్లు కోల్పోయి 60,840 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 265 పాయింట్ల పతనంతో 42,986కు చేరింది. కాగా.. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60,871- 18,132 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18,080- 18,036- 17,965 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 18,221- 18,264- 18,335 లెవల్స్​ వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : ఓఎన్​జీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 142, టార్గెట్​ రూ. 150- రూ. 154

బజాజ్​ ఫిన్​సర్వ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1510, టార్గెట్​ రూ. 1600- రూ. 1620

యూకో బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 26, టార్గెట్​ రూ. 39

నేటి స్టాక్స్​ టు బై పూర్తి లిస్ట్​ను ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టాటాస్టీల్​, టాటా మోటార్స్​, హెచ్​యూఎల్​, రిలయన్స్​, ఎస్​బీఐ, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

మారుతీ సుజుకీ, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​, కొటాక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market news : క్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా మార్కెట్​లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.22శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.25శాతం, నాస్​డాక్​ 0.11శాతం మేర నష్టాల్లో ముగిశాయి. మొత్తం మీద 2022ను నష్టాలతో ముగించాయి అమెరికా స్టాక్​ మార్కెట్​లు. 2018 తర్వాత నష్టాల్లో ముగించడం ఇదే తొలిసారి.

న్యూ ఇయర్​ సందర్భంగా ఆసియాలోని మార్కెట్​లకు నేడు సెలవు.

2023 మల్టీబ్యాగర్​ స్టాక్​గా ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2950.89కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2266.2కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం