Stocks to buy today : స్టాక్స్​ టు బై లిస్ట్​.. ఈ 6 షేర్లు కొంటే భారీ లాభాలు!-day trading guide for today 6 stocks to buy or sell today 2nd january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై లిస్ట్​.. ఈ 6 షేర్లు కొంటే భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై లిస్ట్​.. ఈ 6 షేర్లు కొంటే భారీ లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 07:21 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (MINT_PRINT)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు 2022ను నష్టాలతో ముగించాయి. శుక్రవారం (డిసెంబర్ 30) ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ50.. 85 పాయింట్ల నష్టంతో 18,105 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 293 పాయింట్లు కోల్పోయి 60,840 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 265 పాయింట్ల పతనంతో 42,986కు చేరింది. కాగా.. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ ఛార్ట్​లో పెద్ద నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది కాస్త ప్రతికూల విషయం. ఇది రివర్సెల్​కు సంకేతం.

Stock market new today : "నిఫ్టీకి ప్రస్తుతం 18,250 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది. అందుకే ఎక్కువ లాభాలు కనిపించడం లేదు. 18,250 లెవల్​పైన సెటిల్​ అయితే మార్కెట్​ ఇంకా పెరగొచ్చు. 17,960 అని సపోర్ట్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అభిప్రాయపడ్డారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.

US Stock markets : ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా మార్కెట్​లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.22శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.25శాతం, నాస్​డాక్​ 0.11శాతం మేర నష్టాల్లో ముగిశాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2950.89కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2266.2కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఓఎన్​జీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 142, టార్గెట్​ రూ. 150- రూ. 154

బజాజ్​ ఫిన్​సర్వ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1510, టార్గెట్​ రూ. 1600- రూ. 1620

యూకో బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 26, టార్గెట్​ రూ. 39

జీఎంఆర్​ ఇన్​ఫ్రా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 34, టార్గెట్​ రూ. 45

రిలయన్స్​:- బై రూ. 2550, స్టాప్​ లాస్​ రూ. 2500, టార్గెట్​ రూ. 2650

గుజరాత్​ స్టేట్​ ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ (జీఎస్​ఎఫ్​సీ):- బై రూ. 140, స్టాప్​ లాస్​ రూ. 132, టార్గెట్​ రూ. 155

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం