How to become crorepati : రోజుకు రూ. 500 పొదుపు చేసి కోటీశ్వరులు అవ్వండి! ఎలా అంటే..!
15 x 15 x 15 rule of mutual funds : తక్కువ సమయంలోనే మీరు కోటీశ్వురు అవ్వాలని భావిస్తున్నారా? అయితే.. ఈ మ్యూచువల్ ఫండ్ రూల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే!
How to become crorepati : డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో చాలా మంది భారీగా సంపదన సృష్టించుకోవాలని కలలుకంటుంటారు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవడంలో మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని అందరికి తెలిసిందే. అయితే.. ఇందులోనూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి! కొన్ని రూల్స్ పాటిస్తే.. అనుకున్న దాని కన్నా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కూడా కావొచ్చు! ఇలాంటి వాటిల్లో ఒకటే ఈ '15X15X15' రూల్. ఈ రూల్‌తో 15ఏళ్లకే మీరు కోటీశ్వురు అవ్వొచ్చు! ఎలా అంటే..
15X15X15 రూల్ అంటే ఏంటి..?
మ్యూచువల్ ఫండ్‌లో ఈ రూల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది! మీరు.. 15ఏళ్ల పాటు, నెలకు రూ. 15వేలను.. 15శాతం యాన్యువల్ రిటర్నులు వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడమే.. ఈ రూల్ సారాంశం. అంటే.. మీరు రోజుకు రూ. 500 పొదుపు చేసి, పెట్టుబడి చేస్తున్నట్టే!
15 x 15 x 15 rule of mutual funds : ఇప్పుడు దీని లెక్కలను అర్థం చేసుకుందాము. ఇక్కడే మనకి 'కాంపౌండింగ్'కి ఉన్న శక్తి అర్థం అవుతుంది. మీరు 15ఏళ్ల పాటు.. నెలకు రూ. 15వేలు సిప్ చేస్తే.. దాని విలువ రూ. 27,00,000 అవుతుంది. ఇక 15శాతం కాంపౌండింగ్ యాన్యువల్ రిటర్నులతో మీరు రూ. 1కోటి సంపాదించుకోగలరు!
ఇదీ చదవండి:- నెలకు రూ. 1,000 పెట్టుబడితో మిలియనీర్‌గా మారే ఛాన్స్.. వివరాలివే!
మీ రూ. 27లక్షలపై రూ. 74,52,946 రిటర్ను వస్తుంది. ఈ రెండింటినీ కలిపితే.. మీ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 1,01,52,946కి చేరుతుంది. ఈ వివరాలను ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా తెలిపారు.
15X15X30 రూల్..
ఇదే ఇన్వెస్ట్‌మెంట్‌ను మీరు మరో 15ఏళ్లు కొనసాగిస్తే.. కని,విని ఎరుగని రీతిలో మీరు సంపదను సృష్టించుకోవచ్చు! అంటే.. మీరు 30ఏళ్ల పాటు.. నెలకు రూ. 15వేలను 15శాతం యాన్యువల్ రిటర్నులు వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాము. మీ పెట్టుబడి విలువ రూ. 54లక్షలుగా ఉంటుంది. దానిపై మీకు రూ. 9,97,47,309 లాభం వస్తుంది. ఈ రెండింటినీ కలిపితే.. మీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ. 10,51,47,309 అవుతుంది!
15 x 15 x 30 rule in mutual funds : ఈ లెక్కల బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి టైమింగ్ కాదు.. టైమ్ చాలా ముఖ్యమని! చిన్న వయస్సు నుంచే డబ్బులు పోగేసి, వాటిని ఇన్వెస్ట్ చేయడంతో తక్కువ కాలంలోనే భారీ సంపదను సృష్టించుకుని కోటీశ్వరులు అవ్వొచ్చు!
(గమనిక:- మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుపడి కూడా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం