Maruti Fronx CNG : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కు 'సీఎన్జీ' టచ్..!
Maruti Fronx CNG variant : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వచ్చే నెలలో సేల్‌కి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. ఫ్రాంక్స్ సీఎన్జీ వేరియంట్ కూడా రానుందని తెలుస్తోంది.
Maruti Fronx CNG variant : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌పై ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. 2023 ఆటో ఎక్స్‌పోలో దీనిని తొలిసారిగా ప్రదర్శించింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. ఈ ఎస్యూవీ సేల్స్ మార్చ్‌లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిక బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మారుతీ ఫ్రాంక్స్‌కు సీఎన్జీ వేరియంట్ కూడా రానుందని సమాచారం.
ఫ్రాంక్స్ సీఎన్జీ వేరియంట్..
ఎమిషన్ కిట్‌తో కూడిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీఎన్జీ వేరియంట్‌ను మార్కెట్ వర్గాలు ఇటీవలే గుర్తించాయి. ఫలితంగా ఇది కూడా త్వరలోనే లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
Maruti Fronx CNG : బలెనోలో ఉండే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజినే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో కూడా ఉంటుంది. ఇక బలెనోకు సీఎన్జీ వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 78పీఎస్ పవర్‌ను, 98.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ 30.61కి.మీ/కేజీ. మారుతీ ఫ్రాంక్స్ సీఎన్జీకి కూడా ఇంజిన్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
అయితే.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇందులో 5స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి.
Maruti Fronx vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్ వర్సెస్ టాటా పంచ్.. ది బెస్ట్ ఏది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Maruti Fronx on raod price : మారుతీ ఫ్రాంక్స్ డెల్టా, జెటా వేరియంట్లకు సీఎన్జీ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. బలెనోలోనూ ఈ వేరియంట్లే సీఎన్జీ టచ్ ఇచ్చింది ఆటో సంస్థ. ఇక సీఎన్జీ వేరియంట్లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టెమ్, వయర్లెస్ ఛార్జర్, ఇంజిన్ పుష్ స్టార్ట్/ స్టాప్ బటన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది.
తొలుత మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ లాంచ్ అవ్వొచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఫ్రాంక్స్ సీఎన్జీ వర్షెన్‌ను మారుతీ సుజుకీ మార్కెట్లోకి తీసుకురావచ్చు.
Maruti Fronx bookings : ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే రూ. 8లక్షల నుంచి ప్రారంభం అవ్వొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఇక సీఎన్జీ వేరియంట్.. పెట్రోల్ మోడల్ కన్నా రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
సంబంధిత కథనం